https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి దర్శకత్వం లో చేసి కూడా స్టార్ హీరోలు అవ్వలేకపోయిన అన్ లక్కీ హీరోలు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2024 / 01:30 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. మరి ఇప్పటికే వాళ్ళు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న వేళ పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీని శాశిస్తూ రాజమౌళి లాంటి దర్శకుడు సైతం భారీ విజయాల మీద కన్నేస్తు ముందుకు సాగుతున్నాడు…

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న ఒకే ఒక దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఈ దర్శకుడుని బీట్ చేసే డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే ఆయనకంటూ ఒక ఉన్నతమైన ప్రతిభను కూడా చాటుకునే విధంగా తన సినిమాలు తనను ఎలివేట్ చేస్తు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఆయనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఆయన డైరెక్షన్ లో నటిస్తే వాళ్ళకంటూ మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క హీరో ఆయన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు… అయితే ఆయన సినిమాల్లో హీరోలుగా నటించిన ఒక ముగ్గురు హీరోలు మాత్రం ఇప్పటివరకు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకోలేకపోయారు. వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    సై సినిమాతో నితిన్ కి రాజమౌళి డైరెక్షన్ లో నటించే అవకాశం అయితే వచ్చింది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికి నితిన్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం తో జనాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ కాస్త పోయింది. ఇక ఆ తర్వాత ఇష్క్ సినిమాతో మళ్లీ సక్సెస్ ను అందుకున్నప్పటికి ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు…

    ఇక అప్పటి వరకు అలా మొదలైంది, పిల్ల జమిందారు లాంటి చిన్న సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న నాని కి రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా చేసే అవకాశమైతే వచ్చింది. దాంతో ఆయన ఒక్కసారిగా స్టార్ హీరోగా వెలుగొందుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఆయన ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరో గానే ముందుకు సాగుతూ ఉండటం విశేషం…

    ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్ సైతం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో హీరోగా నటించి సక్సెస్ ను అందుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ అయినప్పటికి ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి మెప్పించకపోవడంతో సునీల్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…