Kannappa movie : మోహన్ బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ఢీ సినిమాను మినహాయిస్తే ఆయనకి ఇప్పటివరకు సరైన సక్సెస్ అయితే లేదు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనే విషయం మీద పలు ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాలో ప్రభాస్ కీలకమైన పాత్రను వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే మొదట ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ సినిమా పబ్లిసిటీ చేసిన కూడా ఆ తర్వాత ప్రభాస్ నంది పాత్రలో కనిపిస్తున్నాడు అంటూ క్లారిటీ అయితే ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానే ఆయన ఆ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను రాబడతాడా అంటూ కొన్ని కామెంట్లైతే వెలువడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి పాన్ ఇండియాలో భారీ గుర్తింపును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కొన్ని కామెంట్లైతే వస్తున్నాయి. ఇక ప్రభాస్ ఈ సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడు ఆయన స్క్రీన్ టైమ్ ఎంత అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు.
ఇక దానికి అనుగుణంగానే కన్నప్ప సినిమాలో ప్రభాస్ దాదాపు 5 నుంచి పది నిమిషాల పాటు కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని సాగుతున్న మంచు విష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న మంచు విష్ణు తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతాడు. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటివరకు ఆయన కెరియర్ లో లేనంత బడ్జెట్ ను పెట్టి సినిమా చేస్తున్నాడు. కాబట్టి తన ఎంటైర్ కెరియర్ మొత్తం రిస్క్ లో పెట్టడనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…