Syed Mushtaq Ali Tournament : టి20 వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు. అదే ప్రదర్శనను తదుపరి టోర్నీలలోనూ కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో టి20 సిరీస్ జరిగినప్పుడు.. తనదైన స్వాగ్ షాట్ తో హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లోనూ అదరగొట్టాడు. పరుగుల వరద పారించాడు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారు జట్టు తో తలపడుతోంది. ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్యాను బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. దీంతో హార్దిక్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ టోర్నీలో భాగంగా తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా మైదానంలో తాండవం చేశాడు. బ్యాట్ తో పరాక్రమం సృష్టించాడు. ఒకే ఓవర్ లో 29 పరుగులు పిండుకున్నాడు. గురుజప్నీత్ వేసిన 17 ఓవర్లో అతడు ఈ విధ్వంసాన్ని సృష్టించాడు. 6, 6,6,6,4,1 పరుగులు చేసి 29 రన్స్ సాధించాడు. అంతేకాదు కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొని 69 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తాండవానికి బరోడా జట్టు తిరుగులేని విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో తమిళనాడు పై గెలుపును సొంతం చేసుకుంది.
అద్భుతమైన ఫామ్
ఐపీఎల్ లో ముంబై జట్టు కెప్టెన్ గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో తన ప్రతిభను చూపించలేకపోయాడు. పైగా అతడి వ్యక్తిగత జీవితం కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. భార్యతో విడాకులు తీసుకుంటున్నాడని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే దీనిపై అటు హార్దిక్ పాండ్యా, ఇటు అతని భార్య నటాషా నోరు విప్పలేదు. ఈ క్రమంలోనే అతడు టి20 వరల్డ్ కప్ ఆడేందుకు అమెరికా వెళ్లిపోయాడు. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు కీలక ఆటగాళ్లను అవుట్ చేసి భారత జట్టు సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా చూస్తే హార్దిక్ పాండ్యా తన పూర్వపు ఫాం అందుకున్నాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన అనంతరం తన విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే అప్పుడు శ్రీలంక టోర్నికి దూరంగా ఉన్నాడు. మళ్లీ బంగ్లాదేశ్ జట్టుతో టి20 టోర్నీలో పాల్గొన్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లోనూ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంతో.. ప్రస్తుతం దేశవాళి క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా బరోడా జుట్టుకు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్ లో 29 పరుగులు సాధించి.. తనలో ఉన్న అసలు సిసలైన ఆటగాడిని మరోసారి టీమ్ ఇండియా సెలెక్టర్లకు పరిచయం చేశాడు. ఈ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా హార్దిక్ అడుగులు వేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా హార్థిక్ పాండ్యా సిక్సుల వర్షం కురిపించాడు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్ లో 29 పరుగులు చేశాడు. గుర్జప్నిత్ వేసిన 17 ఓవర్లో 6,6,6,6,4,1 కొట్టాడు. మొత్తంగా 30 బంతుల్లో 69 రన్స్ చేశాడు.@hardikpandya7 #hardikpandya pic.twitter.com/kh7FvQWSxj
— Anabothula Bhaskar (@AnabothulaB) November 27, 2024