Prashant Verma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రిషబ్ శెట్టిని హనుమంతుడిగా పెట్టి ‘జై హనుమాన్’ అనే సినిమాని చేస్తున్నాడు. ఇక హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇంకా దాంతో పాటుగా ఆయన కొన్ని కథలను కూడా బయట దర్శకులకు ఇస్తూ వాళ్ల చేత డైరెక్షన్ చేయిస్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా మహేష్ బాబు మేనల్లుడు అయిన అశోక్ గల్లా హీరోగా వచ్చిన ‘దేవకి నందన వసుదేవ’ సినిమాకి ప్రశాంత్ వర్మ కథను అందించాడు. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆయన పేరు భారీగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. మరి ఈ సినిమా ప్లాప్ అవ్వడం వెనక చాలా కారణాలు ఉన్నప్పటికి ప్రశాంత్ వర్మ పేరైతే చాలా ఎక్కువ డ్యామేజ్ అయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన దర్శకత్వం లో వచ్చే సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కిస్తు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే మంచిది.
అలా కాదని ఇలా సైడ్ బిజినెస్ లు చేస్తే ఇలాంటి రిజల్ట్ నే మూటగట్టుకోవాల్సి వస్తుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం ప్రశాంత్ వర్మ ను ఏకీపారేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ వర్మ ఎవ్వరికి కథలను ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు సాగితే మంచిది.
ఎందుకంటే ఈయన కథ రాయడంలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. కానీ అతని కథని సరిగ్గా డీల్ చేసే దర్శకుడు కూడా దొరకాలి. అలాంటప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఇక ఒక్క సినిమా సక్సెస్ తో భారీ గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఇలాంటి నాసిరకం సినిమాలు చేయడం వల్ల ఆయన పేరు భారీగా డ్యామేజ్ అయితే అవుతుంది. దీనివల్ల ఆయన సినిమాకి ప్రమాదం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాబట్టి తన సినిమాని తను డైరెక్షన్ చేసుకుంటూ ముందుకు సాగితే చాలా బెటర్ గా ఉంటుందని నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదిక ప్రశాంత్ వర్మకి సలహాలు సూచనలు అయితే ఇస్తున్నారు. మరి ఇకమీదట ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోకుండా తను చేసే సినిమా మీదనే ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తే మంచిది…