Mahesh Babu: మహేష్ బాబు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ తనదైన స్టైల్ లో దూసుకొని పోతున్నారు. ఈయన నటించే అన్ని సినిమాలు ఆల్మోస్ట్ హిట్ అవుతుంటాయి. ఇలా సినిమా రంగంలో స్టార్ హీరోగా కొనసాగుతూ.. సినిమా రంగంలో ఎంతో సంపాదిస్తున్న ఈ హీరో.. వ్యాపార రంగంలో ఎప్పుడో అడుగుపెట్టారు. బిజినెస్ లో కూడా రాణిస్తూ.. ఆ రంగంలో కూడా బాగా సంపాదిస్తున్నారు. అయితే మహేష్ బాబు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి వ్యాపార రంగంలో ఎంత సంపాదిస్తున్నారో ఓ సారి తెలుసుకుందాం..
మహేష్ బాబుకు రెస్టారెంట్స్, థియేటర్లకు ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఫేమస్ అయిన ఏఎంబీ సినిమాస్ అందరికీ సుపరిచితమే. ఈ మాల్ కు ఓనర్ మహేష్. దీంతో భారీ లాభాలను అందుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఏషియన్ వారితో కలిసి హైదరాబాద్ లో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. మొత్తం మీద హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏఎన్ ప్యాలెస్ హైట్స్ అనే పేరుతో రన్ అవుతున్న రెస్టారెంట్ బంజారాహిల్స్ లో ఫేమస్ గా నిలుస్తోంది. అయితే ఇందులో ఒక సారి టిఫిన్ చేయాలంటే ఏకంగా రూ.500 చెల్లించుకోవాల్సిందే.
ఈ రెస్టారెంట్ లో ఒక ప్లేట్ ఇడ్లీ అయినా దోశ అయినా ఏది తినాలన్నా రూ. 500 నుంచి రూ. 600 చెల్లించాల్సిందే. రేట్లు హై రేంజ్ లో ఉన్నా కూడా ఈ రెస్టారెంట్ కు చాలా మంది వెళ్తుంటారు. ఇక్కడ టేస్టీ టేస్టీ ఐటమ్స్ ఉంటాయట. టేస్టీ ఫుడ్, హై రేంజ్ కాస్ట్ తో భారీ స్థాయిలో బిజినెస్ అవుతుంది. కేవలం ఒకే రోజు ఏకంగా రూ. 8 నుంచి రూ. 10 లక్షల వరకు బిజినెస్ జరుగుతోందట.ఒక పేదకుటుంబం ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకోగలుగుతుంది. దీని కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటుంది. అయినా నెరవేరుతుందో లేదో తెలియదు. కానీ మహేష్ బాబు మాత్రం ఆ సంపాదన ఒకే రోజు సంపాదిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.