https://oktelugu.com/

Sneha Reddy: అలా యాడ్ లో కనిపించి షాకిచ్చిన అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి

అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్లను మించి ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ ఔట్ ఫిట్స్ తో ఫొటో షూట్స్ చేసి వాటిని అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 12, 2024 / 01:10 PM IST

    Sneha Reddy

    Follow us on

    Sneha Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ప్రస్తుత పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

    అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్లను మించి ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ ఔట్ ఫిట్స్ తో ఫొటో షూట్స్ చేసి వాటిని అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. దాంతో పాటు స్నేహ రెడ్డి కుటుంబంతో పాటు పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకున్నారు. అంతేకాదు ఆమె తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు.

    స్నేహరెడ్డిని చూసిన ప్రతి ఒక్కరూ ఈమె చిత్ర పరిశ్రమలో అడుగు పెడితే బాగుంటుందని భావిస్తారు. ఆమె సినీ రంగ ప్రవేశం చేస్తే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారని, మంచి విజయాన్ని సాధిస్తారని అంటుంటారు. అయితే ఇన్ని రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న స్నేహ రెడ్డి అభిమానులు కోరుకున్న విధంగా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. కానీ హీరోయిన్ గా కాదులేండి.. యాడ్ లో కనిపించారు స్నేహరెడ్డి. ప్రస్తుతం స్నేహరెడ్డి చేసిన యాడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అల్లు అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    కిండర్ బ్రాండ్ కు సంబంధించిన ఈ యాడ్ లో స్నేహిరెడ్డి కిండర్ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేస్తూ కనిపిస్తారు. ఎంతో నాచురల్ లుక్ లో కనిపించే స్నేహరెడ్డిని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. ఈ యాడ్ లో స్నేహరెడ్డితో పాటు మరో అబ్బాయి కనిపిస్తారు.. అయితే ఆ అబ్బాయి స్థానంలో కనుక అల్లు ఆయాన్ ఉంటే యాడ్ మరో లెవల్ లో ఉండేదని అల్లు అభిమానులు భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు యాడ్ లో స్నేహరెడ్డిని చూసిన నెటిజన్లు ఆమె హీరోయిన్ లా ఉన్నారని, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తే కచ్చితంగా మంచి విజయాలను అందుకుంటారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.