https://oktelugu.com/

Lakshadweep: లక్షద్వీప్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

లక్షద్వీప్ అనేది అందమైన ప్రాంతం. సముద్రానికి దగ్గరగా ఏర్పడిన ఒక సుందర ప్రదేశం. ఈ ప్రాంతంలో పాములు, కుక్కలు మచ్చుకైనా కనిపించవు. అరుదైన ఆవును అక్కడ మాత్రం చూడవచ్చు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 12, 2024 1:16 pm
    Lakshadweep

    Lakshadweep

    Follow us on

    Lakshadweep: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. వెంటనే లక్షద్వీప్ స్వరూపం మారిపోయింది. చాలామంది తమ సాహస క్రీడలకు అనువైన ప్రాంతంగా లక్షద్వీప్ ను ఎంచుకుంటున్నారు. నిన్నా మొన్నటిదాకా మాల్దీవులకు పోలోమంటూ వెళ్లిపోయిన వారు.. నరేంద్ర మోడీ ఒక్క పిలుపునివ్వడంతో దెబ్బకు లక్షద్వీప్ బాట పడుతున్నారు. ఇంతకీ లక్షద్వీప్ ఎందుకు అంత ప్రత్యేకం? ప్రత్యేకంగా ఏముంటాయి? అక్కడి వింతలు విశేషాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    లక్షద్వీప్ అనేది అందమైన ప్రాంతం. సముద్రానికి దగ్గరగా ఏర్పడిన ఒక సుందర ప్రదేశం. ఈ ప్రాంతంలో పాములు, కుక్కలు మచ్చుకైనా కనిపించవు. అరుదైన ఆవును అక్కడ మాత్రం చూడవచ్చు. భారతదేశంలో ఇది భాగమైనప్పటికీ ఇక్కడి సంస్కృతి మనదేశానికంటే పూర్తి విభిన్నంగా ఉంటుంది. లక్షద్వీప్ 36 చిన్న చిన్న దీపాలతో కూడి ఉంటుంది. ఇక్కడ జనాభా మొత్తం 64,000. ఈ జనాభాలో 96% ముస్లింలు. లక్షద్వీప మొత్తం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ వైశాల్యం దాదాపు పదిరెట్లు తక్కువగా ఉంటుంది. ఇక్కడ విస్తరించి ఉన్న 32 ద్వీపాలలో కేవలం 10 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అందులో కవరత్తి, అగట్టి, అమిని, కద్మత్, కిలాతన్, చెట్లత్, బిత్రా, ఆందోహ్, కల్పాని, మినికాయ్ వంటివి ఉన్నాయి. 100 కంటే తక్కువ జనం కూడా నివసించే అనేక దీపాలు ఇక్కడ ఉన్నాయి. కవరత్తి ఈ ప్రాంత రాజధానిగా ఉంది. కేరళకు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతంలో చాలామంది మలయాళ భాష మాట్లాడుతారు. కొంతమంది మహెనీ అనే భాష కూడా మాట్లాడుతారు. మాల్దీవుల్లో ప్రజలు మాట్లాడే భాష కూడా ఇదే. లక్షద్వీప్ ప్రజలకు ప్రధాన ఆదాయం వనరు సముద్రం. ఈ సముద్రం మీద ఆధారపడి చాలామంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొబ్బరి తోటల పెంపకం, చేపలు పట్టడం, సముద్ర ఆధారిత వ్యవసాయం చేయడం వంటి పనులు ఇక్కడ ప్రజలు చేస్తూ ఉంటారు.

    లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ నౌకాదళ స్థావరం కూడా ఉంది.. లక్షద్వీప్ సముద్రంలో 600 కంటే ఎక్కువ చేపల జాతులు ఇక్కడ ఉంటాయి. 78 కంటే ఎక్కువ పగడాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి.. 1956లో దీని పేరు లక్షద్వీప్ అనే మార్చడానికి ముందు లక్కడివ్ అని పిలిచేవారు. ఇక కవరత్తి ప్రాంతంలో కాకులు అసలు కనిపించవు. లక్షద్వీప్ లో పిల్లులు, ఎలుకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని రేబిస్ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. బట్టర్ ఫిష్ లక్షద్వీప్ అధికారిక జంతువు. ఆరు రకాల కు చెందిన సీతాకోకచిలుక ను పోలి ఉన్న చేపలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సూటి టెర్న్ ఈ రాష్ట్ర పక్షి. బ్రెడ్ ఫ్రూట్ ఈ రాష్ట్ర చెట్టు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించే సైరేనియా అనే జంతువు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది.. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. పర్యాటకులు పెరిగిపోయిన నేపథ్యంలో తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.