Mahesh Babu: మహేష్ బాబు ఎంత సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. విమానం కూడా ఉందట…

బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాలు హిట్ లను సొంతం చేసుకున్నా.. మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణించారు. అంతేకాదు వెండితెరపై హీరోగా రాణిస్తూనే రియల్ లైఫ్ లో కూడా హీరోగా పేరు సంపాదించారు.

Written By: Swathi, Updated On : January 18, 2024 8:40 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: గుంటూరు కారం సినిమాతో మరోసారి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా జనవరి 12న విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఎన్నో సినిమాల్లో నటించి తన సత్తా చాటాడు. వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి మహేష్ బాబు చాలా కష్టపడ్డారు. ఆ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి కూడా అదే రేంజ్ లో కష్టపడ్డారు మహేష్. ఇప్పటి వరకు 25 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించాడు.

బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాలు హిట్ లను సొంతం చేసుకున్నా.. మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణించారు. అంతేకాదు వెండితెరపై హీరోగా రాణిస్తూనే రియల్ లైఫ్ లో కూడా హీరోగా పేరు సంపాదించారు. చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు మహేష్. ఇప్పుడు టాలీవుడ్ హీరోలలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల లిస్ట్ లో చేరాడు. ఇక ఈయన బిజినెస్ రంగంలో కూడా చాలానే సంపాదిస్తున్నారు. జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉందట.

హైదరాబాద్ గచ్చిబౌలి లో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్, ఏఎంబీ సినిమాస్ కూడా ఉన్నాయి. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతేకాదు రెయిన్ బో ఆస్పత్రిలో గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఆస్తుల విలువ రూ. 273 కోట్లు అని అంచనా వేసింది సీఎన్బీసీ నివేదిక. అలాగే నెలకు రూ. 2 కోట్లు సంవత్సరానికి రూ. 120 కోట్ల వరకు సంపాదిస్తాడని కూడా టాక్. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు రూ. 78 కోట్ల పారితోషికం తీసుకున్నారట. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు రూ. 125 కోట్లు తీసుకోబోతున్నారట.

ఎన్నో బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్నారు. ఇలా ప్రతి బ్రాండ్ కు రూ. 10 కోట్లు వసూలు చేస్తారట. 2022 లో మహేష్ నికర విలువ రూ. 220 కోట్లు. 2015లో రూ. 90 కోట్లు అని తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం ఉంది. దాని విలువ రూ. 28 కోట్లు. బెంగళూరులో కూడా ఓ భవనం ఉంది. ఇక ఈ స్టార్ కు కార్లంటే ఇష్టం. అందుకే చిన్నప్పటి నుంచి ఆయన గ్యారేజ్ లో ఎన్నో కార్లు ఉంటాయట. ఇటీవల లెక్సస్ ఎల్ ఎక్స్ 570ని కూడా కొనుగోలు చేశారు. ప్రైవేట్ విమానం, విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ ఉంది. ప్రొడక్షన్ హౌస్, మల్టీప్లెక్స్, ఏఎన్ రెస్టారెంట్ కూడా మహేష్ సొంతం.