https://oktelugu.com/

Naga Chaitanya And Sobhita: శోభిత తల్లిదండ్రులు నాగ చైతన్య కి ఎంత కట్నం ఇస్తున్నారో తెలుసా..? నాగార్జున కోడలు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!

వచ్చే నెల నాల్గవ తేదీన వీళ్లిద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులూ, వ్యాపార వేత్తలు ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 1:14 pm
    Sobhita And Naga Chaitanya

    Sobhita And Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya And Sobhita: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన నాగ చైతన్య , శోభిత దూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అభిమానులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వీళ్లిద్దరి నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీన జరిగింది. వీళ్లిద్దరి నిశ్చితార్ధ వార్త అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఆ తర్వాత పెళ్లి పనులు చకచకా జరుపుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ జంట. శోభిత దూళిపాళ్ల అచ్చ తెలుగు అమ్మాయి, ఈమె జన్మస్థలం గుంటూరు జిల్లాలోని, తెనాలి. ప్రస్తుతం ఆమె కుటుంబం మొత్తం వైజాగ్ లో ఉంటుంది. తన పెళ్లి తెలుగు సంప్రదాయాలను తూచా తప్పకుండ పాటిస్తూ చేసుకోవాలి అనేది శోభిత కోరిక. దానికి తగ్గట్టుగానే పెళ్లికి ముందు జరగాల్సిన పనులన్నీ జరుపుకుంది శోభిత. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అవి తెగ వైరల్ గా మారింది. ఎంత ఎదిగిన మన తెలుగు సంప్రదాయ మూలలను మర్చిపోనందుకు శోభితకి నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురిసింది.

    ఇదంతా పక్కన పెడితే వచ్చే నెల నాల్గవ తేదీన వీళ్లిద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులూ, వ్యాపార వేత్తలు ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియా లో శోభిత తల్లిదండ్రులు నాగార్జున కి ఇచ్చిన కట్నం గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. కట్నంగా నాగార్జున డబ్బులు, ఇళ్ల స్థలాలు ఏమి అడగలేదట, కావాల్సినంత ఆస్తి మా దగ్గర ఉంది, కేవలం శోభిత మా ఇంటికి కోడలుగా నాగ చైతన్య కంటికి రెప్పలా చూసుకుంటే చాలు అని చెప్పాడట. కానీ శోభిత తల్లిదండ్రులు మాత్రం తమ తృప్తి కోసం 10 కిలోలకు పైగా బంగారం ని కట్నం గా ఇచ్చి పంపబోతున్నారట. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కిలో బంగారం 71 లక్షల రూపాయిలు. 10 కిలోలు అంటే 7 కోట్ల రూపాయిలు అన్నమాట.

    పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శోభిత దూళిపాళ్ల ఫేమ్, నాగ చైతన్య తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పదింతలు రెట్టింపు అయ్యింది. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే సినిమాల విషయంలోనే అప్పట్లో నాగ చైతన్య, సమంత కి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. అలాంటిది అక్కినేని కుటుంబం శోభిత ని సినిమాల్లో కొనసాగేందుకు దాదాపుగా ఒప్పుకోరు. శోభిత కూడా ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న సినిమాలను, వెబ్ సిరీస్ లను పూర్తి చేసుకుంది. కొత్తగా ఆమె మరో సినిమాకి సంతకం చేయలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక నుండి ఆమె గ్లామర్ పాత్రలను చేయదు, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందని. చూడాలి మరి ఈమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.