Chaganti Koteswara Rao: సమాజంపై ప్రభావితం చూపే ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు. అటువంటి వారిలో చాగంటి కోటేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు. ఆయన ప్రవచనాలు వినేందుకు లక్షలాదిమంది ఎదురుచూస్తుంటారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా చాగంటి వారు సుపరిచితులు. ఆధ్యాత్మిక ప్రసంగాలతో భక్తులను మైమరిపిస్తారు. మంచి వాగ్దాటితో ఆకట్టుకుంటారు. ఆయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా బాధ్యతలు అప్పగించింది. గతంలో కూడా ఆయనకు ప్రభుత్వం ఇదే మాదిరిగా పదవి ఇచ్చింది. కానీ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు మాత్రం బాధ్యతతో వ్యవహరిస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
* ఎఫ్ సి ఐ ఉద్యోగిగా
చాగంటి కోటేశ్వరరావు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన భార్య సైతం వ్యవసాయ శాఖలో ఉన్నత అధికారిణి. అయితే నిత్యం ప్రవచనాలతో బిజీగా ఉండే చాగంటి కోటేశ్వరరావు విధులకు హాజరవుతారా? అన్న డౌట్ తప్పకుండా వస్తుంది.కానీ కోటేశ్వరరావు ఆఫీస్కు ఒక్క రోజు కూడా సెలవు పెట్టరు. లేట్ పర్మిషన్ కూడా తీసుకోరని సహ ఉద్యోగులు చెబుతుంటారు. ఆయన కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ప్రవచనాలు చెబుతారు. అవి కూడా కాకినాడలోని ఓ దేవాలయంలోనే. కావాల్సిన చానల్స్ వారు అక్కడకు వెళ్లి రికార్డు చేసుకునిప్రసారం చేస్తుంటారు.
* సాధారణ జీవితమే
ఇక ఓ సాధారణ జీవితం గడుపుతుంటారు చాగంటి వారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ తో కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీప్రవచనాలు చెప్పేందుకు నయా పైసా కూడా ఆయన తీసుకోరు. బయట నగరాలకు వెళ్లినప్పుడు.. తన సొంత డబ్బులతో స్లీపర్ క్లాస్ టికెట్ కొని రైలులో ప్రయాణం చేస్తారు. నిర్వాహకుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరట.చాగంటి కోటేశ్వరరావుకు చిన్నపాటి ఇల్లు మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఆయనకు కారు లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆఫీసుకు బైక్ మీద వెళ్తుంటారట.
* తోబుట్టువుల బాధ్యత
చాగంటి కోటేశ్వరరావు చిన్న వయసులోనే ఉండగానే తండ్రి మరణించారు. ఆయనకు ఇద్దరు సోదరీమణులు, ఒక తమ్ముడు ఉన్నాడు. తల్లి కష్టపడి చదివించడంతో.. పెద్దకుమారుడు కావడంతో బాధ్యతగా చదువుకున్నారు చాగంటి. ప్రాథమిక స్థాయి నుంచి చదువులో ముందు ఉండేవారు. యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆయన ఉద్యోగంలో చేరిన తర్వాత తమ్ముడు, అక్క చెల్లెళ్లను పెళ్లిళ్లు చేశారు.
* వినమ్రంగా తిరస్కరించి
దేశానికి ప్రధానిగా పీవీ నరసింహారావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో ప్రధాని పీవీని కలిశారు చాగంటి. మీ గురించి ఎంతో విన్నాను, మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం, మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి చేసి పెడతాను అంటూ పివి నరసింహారావు అడిగితే… చాగంటి మాత్రం నవ్వేసి… మీ సహృదయానికి నా కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు అంటూ నమస్కరించి వెళ్లిపోయారట. చాగంటి వంశంలో తరానికి ఒక్కరికి ఇలా సరస్వతి జ్ఞానం అబ్బినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు చెబుతుంటారు.