Brahmastra Movie: బ్రహ్మాస్త్రలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా?

Brahmastra Movie: బ్రహ్మాస్త్ర నేడు విడుదలైంది. రణవీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. వివాహం తరువాత రణవీర్ కపూర్, అలియా భట్ నటించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. దీంతో వీరి కాంబినేషన్ మంచి హిట్ కావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇద్దరు దేశమంతా పర్యటించి సినిమాను హిట్ చేయాలని కోరారు. ఈ సినిమాకు ముందు […]

Written By: Srinivas, Updated On : September 9, 2022 12:53 pm
Follow us on

Brahmastra Movie: బ్రహ్మాస్త్ర నేడు విడుదలైంది. రణవీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. వివాహం తరువాత రణవీర్ కపూర్, అలియా భట్ నటించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. దీంతో వీరి కాంబినేషన్ మంచి హిట్ కావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇద్దరు దేశమంతా పర్యటించి సినిమాను హిట్ చేయాలని కోరారు. ఈ సినిమాకు ముందు డ్రాగన్ అని పేరు పెట్టాలని భావించినా చివరకు బ్రహ్మాస్ర్త గా నామకరణం చేసినట్లు చెబుతున్నారు.

Brahmastra Movie

ఇందులో హీరోకు అగ్నికి సంబంధం ఉండటంతో బ్రహ్మాస్త్రకు ఓకే చేశారు. సినిమాను 2017లో ప్రారంభించి ఇప్పటికి పూర్తి చేశారు. ఆరేళ్లుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ కథను సిద్ధం తయారు చేసేందుకే సమయం తీసుకున్నారు. 2018 ఫిబ్రవరిలో బల్గేరియాలో చిత్రీకరణ ప్రారంభించారు. మార్చి 2022న వారణాసిలో సినిమాను పూర్తి చేశారు. సినిమాలో జల అస్త్రం, అగ్ని అస్త్రం, వానరాస్త్రం, నంది అస్త్రం, బ్రహ్మాస్త్రం గురించి వివరంగా చూపించారు. దీంతో బ్రహ్మాస్త్రం అనేది ఓ అస్త్రంగానే సినిమా మొత్తం ఉంటుంది.

సినిమా దేశంలోని ఐదు వేల థియేటర్లు, విదేశాల్లో మూడు వేల స్క్రీన్లలో విడుదల చేశారు. సినిమా విడుదల ఇంతవరకు ఐదుసార్లు వాయిదా పడింది. చివరకు నేడు విడుదల అయింది. తెలుగులో ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. దీంతో సినిమాపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా జంటగా నటించి 18 ఏళ్లు దాటింది. మళ్లీ ఆ అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చింది. చివరగా వారు హమ్ కౌన్ హై లో నటించారు. నాగార్జున హిందీలో 16 ఏళ్ల తరువాత నటించడం గమనార్హం.

Brahmastra Movie

దీంతో బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విభిన్నమైన కథతో తెరకెక్కించారు. ఇందులో సాంకేతికతకు కూడా పెద్దపీట వేశారు. ఆరేళ్లుగా నిర్మిస్తుండటంతో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా వైవిధ్యంగా ఉండాలని భావించి ప్రతి సన్నివేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు. తెలుగులో రాజమౌళి సమర్పిస్తుండటంతో సినిమా హిట్ అనే వాదన కూడా వస్తోంది. మొత్తానికి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన బ్రహ్మాస్ర్త ప్రేక్షకులను ఏ మేరకు రంజింప చేయనుందో చూడాల్సిందే మరి.

Tags