Pawan Kalyan: పవర్ స్టార్ మేనియా ఎలా ఉంటుందో ఆయనకు కరెక్ట్ సినిమా పడితే తెలుస్తుంది. గబ్బర్ సింగ్, వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి సినిమాలు పవన్ కెరీర్ కు ఎంతో బూస్ట్ నిచ్చాయి. ఆయన నటనలోని విభిన్న కోణాలు బయటపెట్టాయి. అలాంటి సినిమా రావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే అంతకుమించిన సినిమాగా ‘హరిహర వీరమల్లు’ రాబోతోంది. మొగల్ సామ్రాజ్యంలో చక్రవర్తులను ముప్పుతిప్పలు పెట్టిన బందిపోటు వీరమల్లుగా ఒక చారిత్రక పాత్రను పవన్ పోషిస్తున్నారు. ఇంతవరకూ పవన్ ఇలాంటి పాత్రలు తన కెరీర్ లోనే చేయలేదు. దీంతో దీనికోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Brahmastra Movie: బ్రహ్మాస్త్రలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా?
ఇటీవల వదిలిన గ్లాన్స్ టీజర్ లు పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ప్యాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో , బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో మంచి డిమాండ్ వచ్చేసింది. సినిమా కోసం ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది.
దాదాపు 150 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీకి సినిమా పూర్తికాకుండానే వివిధ భాషల్లో రిలీజ్ లకు ముందే అడ్వాన్సులు, థియేట్రికల్ హక్కులు, శాటిలైట్ హక్కులన్నీ కలిపి 150 కోట్లు దాటేశాయట.. సినిమా పూర్తి కాకుండానే ఈ రేంజ్ లో వస్తే ఇక రిలీజ్ వేళ ఇంకా ఎంత బజ్ వస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు గొప్ప శుభవార్త అని.. రిలీజ్ కు ముందే పవన్ కెరీర్ లో ఇంత బజ్, డబ్బులు వచ్చిన సినిమా ఇదే ఫస్ట్ అని అంటున్నారు.
Also Read:Queen Elizabeth II: పాస్‌పోర్ట్,వీసా లేకుండానే ప్రపంచంలో ఎక్కడికైనా క్వీన్ ఎలిజబెత్!