Gopichamd : గోపీచంద్ ‘విశ్వం’ చిత్రం సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..? ఈసారి కూడా హిట్ కష్టమే!

ఒకవేళ సక్సెస్ కాకపోతే బంగారం లాంటి కెరీర్ పోతుందని ఎవ్వరూ రిస్క్ చేయరు. కానీ గోపీచంద్ ఆ రిస్క్ ని సమర్థవతంగా ఎదురుకున్నాడు. ఆయన హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో ఆయనకు వరుసగా హీరో గానే అవకాశాలు వచ్చాయి.

Written By: Vicky, Updated On : October 8, 2024 12:18 pm

Gopichand Vishwam movie

Follow us on

Gopichamd :  ఒకప్పుడు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకడు గోపీచంద్. విలన్ గా వరుసగా మూడు సినిమాలు చేసి, జనాల్లో ఒక ముద్ర వేసుకున్న తర్వాత మళ్ళీ హీరోగా మారి సినిమాలు చేయడం పెద్ద సాహసమే. అప్పట్లో విలన్ గా గోపీచంద్ కి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు, ఆయన స్థానం లో ఎవ్వరు ఉన్నా కూడా హీరో గా రిస్క్ చేయకుండా విలన్ గానే కొనసాగేవారు, ఎందుకంటే హీరో గా సక్సెస్ అవ్వొచ్చు, కాకపోవచ్చు, ఒకవేళ సక్సెస్ కాకపోతే బంగారం లాంటి కెరీర్ పోతుందని ఎవ్వరూ రిస్క్ చేయరు. కానీ గోపీచంద్ ఆ రిస్క్ ని సమర్థవతంగా ఎదురుకున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘యజ్ఞం’ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో ఆయనకు వరుసగా హీరో గానే అవకాశాలు వచ్చాయి.

ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని అందుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు, తనకంటూ టాలీవుడ్ లో ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఆ మార్కెట్ ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయాడు. నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా సినిమాలు చేయకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా ఆడియన్స్ తిరస్కరిస్తున్నారు. అలాంటిది గోపీచంద్ స్క్రిప్ట్ ఎంపికపై జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తనకు ఉన్నటువంటి మార్కెట్ మొత్తాన్ని కోల్పోయాడు. ఇది అక్టోబర్ 10వ తారీఖున విడుదల అవ్వబోతున్న ‘విశ్వం’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 5 కోట్ల రూపాయలకు జరిగింది. గోపీచంద్ గత చిత్రాలు 20 నుండి 25 కోట్ల రూపాయలకు బిజినెస్ జరుపుకునేవి. కానీ ఇప్పుడు 5 రేట్ల తగ్గిపోయిందంటే ఆయన మార్కెట్ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే ఆ 5 కోట్ల రూపాయిలు కూడా ఎక్కువ అనిపిస్తుంది. శ్రీను వైట్ల ఇంకా మారలేదు. అదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములా ని అనుసరించాడు. సినిమాలో ఉన్న ఆర్టిస్టులు మొత్తం పెద్ద వాళ్ళే.

వాళ్లందరికీ రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికే 10 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటిది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 5 కోట్ల రూపాయలకు ఫిక్స్ అయ్యిందంటే నష్టానికి అమ్ముతున్నట్టే లెక్క. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఈయన గత సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. బయ్యర్స్ కి ఈయన భారీ నష్టాలను మిగిలించాడు. ఆ ప్రభావం విశ్వం పై పడిందా?, అందుకే ఇంత తక్కువ రేట్ కి అమ్మేశారా అనేది తెలియాల్సి ఉంది. ఒకప్పుడు గోపీచంద్ సినిమాకి మొదటిరోజు 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేవి, కానీ ఇప్పుడే అదే ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం గమనార్హం.