https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు తో సినిమా చేయడం వేస్ట్ అని అంటున్న తమిళ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

మహేష్ బాబు వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నాడు. అయితే మధ్యలో స్పైడర్ సినిమాతో ఒక భారీ ప్లాప్ ను అందుకున్న మహేష్ బాబు తమిళ్ యాక్టర్ లతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : February 13, 2024 / 04:11 PM IST
    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు తన కంటు ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ దాన్ని పెద్దగా వాడుకోకుండా స్వశక్తితో పైకి వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగాడు. అలాగే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క సినిమా చేయకపోయిన కూడా డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నాడు. అయితే మధ్యలో స్పైడర్ సినిమాతో ఒక భారీ ప్లాప్ ను అందుకున్న మహేష్ బాబు తమిళ్ యాక్టర్ లతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే స్పైడర్ సినిమా డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ సినిమా చేసినప్పటికీ అది పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆయన భారీగా డిసప్పాయింట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి తమిళ్ డైరెక్టర్లు చెప్పే కథలు కూడా వినడం లేదు. ఇక ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీకి చెందిన లింగుస్వామి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నాడు. కానీ మహేష్ బాబు తన కథ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక దాంతో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన లింగుస్వామి మహేష్ బాబు తో సినిమా చేయడం వేస్ట్ అని చెప్పినట్టుగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే ఆయన చెప్పిన మాట ఇప్పటిది కాదు స్పైడర్ సినిమా ప్లాప్ అయినప్పుడు ఆ సినిమాను ఉద్దేశించి మహేష్ బాబుతో సాఫ్ట్ గా ఉండే సినిమాలు చేయడం లేదంటే, థ్రిల్లర్ జానర్స్ లో సాగే సినిమాలు చేయడం వేస్ట్ అని ఆయనతో పక్క కమర్షియల్ సినిమాలు చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందంటు ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి…మరి లింగు స్వామి కి మహేష్ బాబు అవకాశం ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…