Ravi Teja Eagle Movie హీరో రవితేజ నటించిన ఈగల్ బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతుంది. పెద్దగా పోటీ లేనప్పటికీ వసూళ్లు ఏమంత జోరుగా లేవు. నాలుగో రోజు ఈగల్ చిత్ర కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. దీంతో రవితేజకు మరో ప్లాప్ తప్పదన్న మాట వినిపిస్తోంది. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈగల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. రవితేజ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో రవితేజ చెలరేగిపోయాడు.
ఫిబ్రవరి 9న ఈగిల్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మొదటి రోజు ఈగల్ వసూళ్లు పర్లేదు అన్నట్లు ఉన్నాయి. శని, ఆదివారాల్లో పెద్దగా డ్రాప్ కనిపించలేదు. నిలకడగా సాగాయి. మూడు రోజులకు ఈగల్ మూవీ రూ. 30 కోట్ల గ్రాస్, రూ. 15.91 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే సోమవారం వసూళ్ళలో భారీ డ్రాప్ కనిపించింది. ఫస్ట్ వర్కింగ్ డే ఈగల్ వసూళ్లు సగానికి పైగా తగ్గాయి.
ట్రెండ్ చూస్తుంటే ఈగల్ బాక్సాఫీస్ వద్ద పుంజుకునే సూచనలు లేవు. ఈగల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 23 కోట్ల టార్గెట్ తో ఈగల్ బరిలో దిగింది. మరో ఏడు కోట్ల షేర్ వస్తే కానీ మూవీ సేఫ్ అవుతుంది. అద్భుతం జరిగితే తప్ప ఈగల్ బ్రేక్ ఈవెన్ కాదు. ఈగల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగోలేదని, సెకండ్ హాఫ్ పర్లేదన్న మాట వినిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈగల్ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. అనుపమ పరమేశ్వరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రోల్ చేసింది. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కాగా రవితేజ గత రెండు చిత్రాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు నిరాశపరిచాయి. ఈగల్ తో హిట్ కొట్టాలని రవితేజ భావించారు. మొదటి వారం గడిస్తే కానీ ఈగల్ మూవీ ఫలితం తెలియదు.