https://oktelugu.com/

Salaar : సలార్ తో ఓ రేంజ్ హైప్ ను సంపాదించిన ఈ నటి గురించి మీకు తెలుసా?

ఆమె ఎవరో కాదు నటి జయవాణి. బుల్లితెరపై అనేక సీరియల్లో విలన్ పాత్రల్లో రప్ఫాడించడంలో కింగ్ ఈ నటి. విక్రమార్కుడు సినిమాలో రవితేజతో జుట్టు పట్టుకుని గొడవపడ్డ నటి కూడా ఈమనే. జయవాణి ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించి నెటిజన్లను మెప్పించింది. అంతేకాదు బుల్లితెరపై సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2024 / 08:26 PM IST

    Do you know about this actress who gained a lot of hype with Salaar

    Follow us on

    Salaar : ఎన్నో సినిమాల్లో కొందరు నటీనటులు కనిపిస్తుంటారు కదా. వారిని చూసినప్పుడు ఎక్కడో చూశామే అనిపిస్తుంటుంది. అయితే ఇన్ గ్రామ్ లో, యూట్యూబ్ లో ఫేమస్ అయిన వారు సినిమాల్లో నటించడం కామన్. అయితే వీరి కట్టుబొట్టు ఆ సినిమాలో కాస్త డిఫరెంట్ గా ఉండటం వల్ల కొన్నిసార్లు గుర్తు పట్టడం కూడా కష్టమే. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకొని పోయింది. థియేటర్ లలో ఓ మోత మోగించింది. ఇందులో చాలా మంది నటించారు. ఈ సినిమాలో యంగ్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించారు.

    కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నెగిటివ్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే శ్రీకాంత్, శ్రుతిహాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది సలార్. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి నెటిజన్లు తెగ విజిల్స్ వేశారు. డైరెక్టర్ నీల్ కు ఫిదా అయ్యారు కూడా. ఇక ఇందులో ప్రభాస్ యాటిట్యూడ్, మేనరిజానికి మురిసిపోయారు ఆయన అభిమానులు. డైలాగ్స్ తక్కువే అయినా కేవలం చూపులు, మేనరిజంతో మతిపోగొట్టాడు డార్లింగ్. సలార్ హిట్ అవడంతో సలార్ పార్ట్ 2 కోసం తెగ వెయిట్ చేస్తున్నారు నెటిజన్లు.

    ఇందులో కనిపించిన ఓ నటి గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సలార్ లో పృథ్వీరాజ్ ను కాపాడే సమయంలో ఓ నటి బీడీ తాగుతూ పచ్చబొట్టు వేస్తుంటుంది ఆ సీన్ గుర్తు వచ్చిందా? అందులో ప్రభాస్ తోపాటు.. ఈ నటి కూడా ఇచ్చిన హైప్ ఏ రేంజ్ లో క్లిక్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పచ్చబొట్టు వేయాలి అని అడిగితే నా కళ్లల్లో కనిపించేది అని ప్రభాస్ చెబుతారు. అంతేకాదు ఆమె దగ్గరున్న బిడీ తీసుకుని తాగుతాడు. అఫ్పుడు ఆమె ప్రభాస్ కళ్లల్లోకి చూస్తూ పచ్చ పొడుస్తుంది. అదిగో ఈ నటి గురించి ఇప్పుడు వైరల్ అవుతుంది.

    ఆమె ఎవరో కాదు నటి జయవాణి. బుల్లితెరపై అనేక సీరియల్లో విలన్ పాత్రల్లో రప్ఫాడించడంలో కింగ్ ఈ నటి. విక్రమార్కుడు సినిమాలో రవితేజతో జుట్టు పట్టుకుని గొడవపడ్డ నటి కూడా ఈమనే. జయవాణి ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించి నెటిజన్లను మెప్పించింది. అంతేకాదు బుల్లితెరపై సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తుంది. ఈ పాత్రలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం చిన్ని సీరియల్లో కావేరిని చిత్రహింసలు పెట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ సీరియల్ అభిమానుల కోపానికి కారణం కూడా అవుతుంది.