https://oktelugu.com/

Dhanush- Aishwarya : విడాకుల కేసు: జడ్జి ఎదుట ధనుష్, ఐశ్వర్య కీలక కామెంట్స్, తుది తీర్పు ఏమిటీ?

రెండేళ్లుగా విచారణలో ఉన్న ధనుష్-ఐశ్వర్య విడాకుల కేసు ఒక కొలిక్కి వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ వెల్ఫేర్ జడ్జి ఎదుట హాజరైన సెలెబ్రిటీ కపుల్ తమ చివరి నిర్ణయం తెలియజేశారు. అదేమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 21, 2024 / 08:15 PM IST

    Dhanush- Aishwarya Divorce case

    Follow us on

    Dhanush- Aishwarya : కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఆయన బంధువు. ఈ క్రమంలో ధనుష్ అక్కయ్యతో రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య అన్యోన్యంగా ఉండేది. ఈ క్రమంలో ధనుష్ తో కూడా ఐశ్వర్యకు అనుబంధం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. చుట్టరికం కూడా ఉన్న నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు వివాహానికి అంగీకారం తెలిపారు. 2004లో ధనుష్-ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. వయసులో ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దది అని సమాచారం.

    వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి యాత్ర 2006లో, చిన్నబ్బాయి లింగ 2010లో జన్మించాడు. వారిద్దరూ టీనేజ్ లో ఉన్నారు. అనూహ్యంగా 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ 2022 జనవరిలో ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది. విడాకుల ప్రకటన అనంతరం కూడా వీరు ఫ్యామిలీ వేడుకల్లో కలిసి కనిపించారు. దాంతో తిరిగి కలిసిపోవచ్చని ఊహాగానాలు వినిపించాయి.

    అయితే ఈ కేసు రెండేళ్లుగా కొనసాగుతుంది. తాజాగా ధనుష్-ఐశ్వర్య విడాకుల కేసులో చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ జడ్జి ఎదుట హాజరయ్యారు. తాము విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందుకు తగు కారణాలు వెల్లడించారు. అయితే జడ్జి తీర్పు చెప్పలేదు. తుది తీర్పు నవంబర్ 27కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. విడాకులకు ఇరువురు అంగీకారం తెలిపిన నేపథ్యంలో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. ధనుష్ ఎఫైర్స్ ఈ విడాకులకు కారణం అయ్యాయనే ఓ వాదన ఉంది.

    ప్రస్తుతం ధనుష్ తెలుగు-తమిళ భాషల్లో కుబేర మూవీ చేస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేశారు. మరోసారి ధనుష్ డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. ఇక నాగార్జున మరో కీలక రోల్ చేస్తున్నారు. ఆయన ధనికుడిగా కనిపిస్తున్నారు. కుబేర చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఫిదా మూవీ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం శేఖర్ కమ్ముల నుండి వస్తున్న చిత్రం ఇది. తన గత చిత్రాలకు భిన్నంగా శేఖర్ కమ్ముల ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో వస్తున్నాడు. రష్మిక లుక్ సైతం ఆసక్తి రేపుతోంది.