https://oktelugu.com/

Kajal Aggarwal: గౌతమ్ ను కాజల్ పెళ్లి చేసుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందే..

కెరీర్ పరంగా కాజల్ బిజీగా ఉన్న సమయంలోనే ఓ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో రూమర్స్ కామన్. మరి కాజల్ విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈమె మాత్రం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. ఆమె స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 11, 2024 / 01:30 PM IST

    Kajal Aggarwal

    Follow us on

    Kajal Aggarwal: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. నటిగా తన ప్రయాణం మొదలు పెట్టి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది ఈ నటి. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తన సత్తా చాటుతూ వచ్చింది. చందమామ, మగధీర వంటి వరుస హిట్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించింది కాజల్. ఇలా కెరీర్ పరంగా తమిళ్, హిందీ, తెలుగు అంటూ తేడా లేకుండా ఫుల్ బిజీ అయింది ఈ బ్యూటీ.

    కెరీర్ పరంగా కాజల్ బిజీగా ఉన్న సమయంలోనే ఓ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో రూమర్స్ కామన్. మరి కాజల్ విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈమె మాత్రం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. ఆమె స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయినా కాజల్.. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చింది. కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ.. కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూనే కెరీర్ ను కొనసాగిస్తుంది.

    అయితే ఈమె గౌతమ్ ను పెళ్లి చేసుకోవడం వెనుక కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను పెళ్లి చేసుకోవడానికి కాజల్ భయపడిందట. హీరోలు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ కావడంతో సమస్యలు మరింత వస్తాయని ఆలోచించిందట. అందుకే సినిమా హీరోలను పెళ్లి చేసుకోకుండా తన చిన్నప్పటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందట కాజల్ అగర్వాల్.

    తన స్నేహితుడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. తన వ్యక్తిత్వం కూడా తెలియడంతో గౌతమ్ కి ఓటు వేసిందట కాజల్. ఈయనతో పెళ్లి తర్వాత సంతోషంగా ఉంది కూడా. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ కు మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈమె సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.