https://oktelugu.com/

SS Rajamouli: రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం మీకు తెలుసా..?

SS Rajamouli: ప్రస్తుతం రాజమౌళి అంటే కేవలం తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా భయంకరమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటున్నాయి. సాధారణంగా హీరో లను బట్టి సినిమాలు చూసేవారు ఉంటారు. కానీ జక్కన్న విషయంలో మాత్రం అంతా రివర్స్. అక్కడ హీరోలు ఎవరు అనేదాని కంటే కూడా.. రాజమౌళి కోసమే థియేటర్లకు క్యూ కట్టే వారు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తోంది. తెలుగులో దీనికి ఇంత క్రేజ్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 22, 2022 / 03:49 PM IST
    Follow us on

    SS Rajamouli: ప్రస్తుతం రాజమౌళి అంటే కేవలం తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా భయంకరమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటున్నాయి. సాధారణంగా హీరో లను బట్టి సినిమాలు చూసేవారు ఉంటారు. కానీ జక్కన్న విషయంలో మాత్రం అంతా రివర్స్. అక్కడ హీరోలు ఎవరు అనేదాని కంటే కూడా.. రాజమౌళి కోసమే థియేటర్లకు క్యూ కట్టే వారు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తోంది. తెలుగులో దీనికి ఇంత క్రేజ్ రావడానికి రామ్ చరణ్, తారక్ కూడా ఒక కారణమే.

    SS Rajamouli

    కానీ ఇతర భాషల్లో ఇంత క్రేజ్ వస్తోంది అంటే దానికి కారణం జక్కన్న మాత్రమే. దాదాపు 20 ఏళ్లుగా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా.. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి మాత్రమే. పైగా చేసిన ప్రతి సినిమా కూడా అంతకు ముందు సినిమాల రికార్డులను బద్దలు కొట్టేదే. అంతగా సినిమాలను తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. కానీ ఒకప్పుడు ఆయన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    Also Read: ఛాన్స్ లు రాక కూలీ పనులు చేసిన స్టార్ హీరో

    డైరెక్టర్ గా ఆయన కెరీర్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతోనే స్టార్ట్ అయింది. కానీ ఈ మూవీ డైరెక్షన్ బాధ్యతలను ఎక్కువగా ఆయన గురువు రాఘవేంద్రరావు చూసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. దీని తర్వాత మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ఓ మైథలాజికల్ డ్రామా మూవీ తీయాలనుకున్నారు రాజమౌళి.

    SS Rajamouli

    కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక తన గురువు రాఘవేంద్రరావు కుమారుడు సూర్యప్రకాష్ తో ఓ భారీ బడ్జెట్ లవ్ స్టోరీ చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇందుకు కారణం భారీ బడ్జెట్. పైగా సూర్య ప్రకాష్ తన తొలి సినిమా నీతో అట్టర్ ప్లాప్ అయింది. ఈ కారణంగా భారీ బడ్జెట్ అంటే కుదరలేదు. దీంతో చేసేది లేక రాజమౌళి తన మొదటి హీరో అయిన ఎన్టీఆర్ ను నమ్ముకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీ అటు తారక్ ను స్టార్ హీరో చేయడమే కాకుండా.. రాజమౌళి ని కూడా స్టార్ డైరెక్టర్ ను చేసింది.

    Also Read: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’

    Tags