https://oktelugu.com/

Aravind Swamy In Ram Charan New Movie: చరణ్ తో మళ్ళీ కొట్టించుకోబోతున్న హ్యాండ్సమ్ హీరో

Aravind Swamy In Ram Charan New Movie: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. నిజానికి చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు. ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 / 04:01 PM IST
    Follow us on

    Aravind Swamy In Ram Charan New Movie: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. నిజానికి చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు.

    Aravind Swamy In Ram Charan New Movie

    ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో మరో భారీ సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి శంకర్ ఈ సినిమా రాబోతుంది అని ఎనౌన్స్ చేసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఒక పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కావాలి అంటే.. కనీసం ఏడాది పడుతుంది.

    Also Read: రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం మీకు తెలుసా..?

    కానీ, శంకర్ ‘ఇండియన్ 2’ గోలలో ఉన్నాడు. మరి చరణ్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ ను ఎప్పుడు రాశాడు ? ఈ అనుమానం నెటిజన్లతో పాటు ఇండస్ట్రీ జనాల్లో కూడా ఉంది. అయితే, చరణ్ – శంకర్ సినిమా స్క్రిప్ట్ లో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కూడా భాగమయ్యాడు. కార్తిక్ చెప్పిన పొలిటికల్ కథ డైరెక్టర్ శంకర్‌కు నచ్చింది.

    కార్తిక్ కథ ఇవ్వగా చిత్రానికి దర్శకత్వం శంకర్ చూసుకుంటున్నారు. అంటే.. కార్తీక్ ఇచ్చిన కథతో శంకర్.. చరణ్ తో సినిమా చేస్తున్నాడు అన్నమాట. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 10 నుంచి 28వ తేదీ వరకు రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

    Aravind Swamy In Ram Charan New Movie

    రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. ఐఏఎస్ అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు.

    Also Read: వారిద్దరూ మళ్ళీ కలిసిపోయారు.. వైరల్ అవుతున్న వీడియో

    Recommended Video:

    Tags