https://oktelugu.com/

Shanmukh fans: ఈ పోరాటం ఏదో స్టీల్ ప్లాంట్ కోసం చేయండి… షణ్ముఖ్ ఫ్యాన్స్ పై నెటిజన్స్ ఫైర్!

Shanmukh fans:  బిగ్ బాస్ సీజన్ 5 లో చివరి అంకం నడుస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ కి సమయం దగ్గర పడుతుంది. ఆఖరివారం కావడంతో హౌస్ లో గేమ్స్, టాస్క్ నిర్వహించడం లేదు. ఈ మూడు రోజులు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ జర్నీని వీడియోల రూపంలో ప్రదర్శించడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన మూమెంట్స్ తో కూడిన ఫోటోగ్రాఫ్స్, మెమరీస్ తో కంటెస్టెంట్స్ 14 వారాల కష్టం మర్చిపోయేలా సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 02:11 PM IST
    Follow us on

    Shanmukh fans:  బిగ్ బాస్ సీజన్ 5 లో చివరి అంకం నడుస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ కి సమయం దగ్గర పడుతుంది. ఆఖరివారం కావడంతో హౌస్ లో గేమ్స్, టాస్క్ నిర్వహించడం లేదు. ఈ మూడు రోజులు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ జర్నీని వీడియోల రూపంలో ప్రదర్శించడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన మూమెంట్స్ తో కూడిన ఫోటోగ్రాఫ్స్, మెమరీస్ తో కంటెస్టెంట్స్ 14 వారాల కష్టం మర్చిపోయేలా సర్ప్రైజ్ లు ఇస్తున్నారు.

    Shanmukh fans

    బిగ్ బాస్ హౌస్ లో గేమ్ చల్లబడగా.. బయట వేడెక్కింది. తమ తమ అభిమాన కంటెస్టెంట్స్ కోసం ఫ్యాన్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కి ఓటు వేసి గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమకు ఇష్టమైన కంటెస్టెంట్ పేరు చెప్పి, అతడే గెలుస్తాడంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు.

    ప్రధాన పోటీ సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్ మధ్య నడుస్తుంది. సోషల్ మీడియా వార్ కూడా ఈ నలుగురు ఫ్యాన్స్ మధ్య జరుగుతుంది. కాగా టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా ఉన్న షణ్ముఖ్ కోసం వైజాగ్ యువత రోడ్లపైకి రావడం విశేషంగా మారింది. వైజాగ్ కి చెందిన షణ్ముఖ్ అభిమానులు ఆయన పేరిట బ్యానర్లు పట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ ఏదో ఒలింపిక్స్ మెడల్ మాదిరి షణ్ముఖ్ ని గెలిపించాలి, అతనికి సప్పోర్ట్ చేయాలని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు.

    ఓట్ ఫర్ షణ్ముఖ్… మన వైజాగ్ కి చెందిన షణ్ముఖ్ టైటిల్ గెలవాలంటూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే షణ్ముఖ్ వైజాగ్ ఫ్యాన్స్ నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్ నగరంలో రాజకీయంగా, సామాజికంగా అనేక సమస్యలు ఉండగా.. బిగ్ బాస్ టైటిల్ కోసం ప్రచారం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారం, ఉద్యమం స్టీల్ ప్లాంట్ కోసం చేస్తే బాగుంటుంది అంటూ.. సెటైర్స్ వేస్తున్నారు.

    Also Read: Rashmika: నెటిజన్​ కామెంట్​కి దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చిన రష్మిక

    ఇలాంటి సమాజానికి ఉపయోగం లేని పనుల కోసం కాకుండా నలుగురికి ఉపయోగపడే విషయాల కొరకు యువత ప్రచారం చేయాలని, క్యాంపెయిన్స్ నిర్వహించాలని కోరుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ షోపై సమాజంలో సదాభిప్రాయం లేదు. అలాంటి బిగ్ బాస్ టైటిల్ కోసం ప్రత్యేకంగా ప్రచారాలు నిర్వహించడం ఓ వర్గాన్ని ఆవేశానికి గురిచేస్తుంది.

    Also Read: Radheshyam: రాధేశ్యామ్​ నుంచి సంచారి ఫుల్​సాంగ్​ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు

    Tags