https://oktelugu.com/

హిట్ అయితే ఓకే.. లేదంటే అన్నీ సర్దుకోవాల్సిందే !

Nidhi Agarwal: ఛాన్స్ లు లేక ఖాళీగా కూర్చునే హీరోయిన్లు చెప్పే బిల్డప్ మాటలు భలే కామెడీగా ఉంటాయి. పాప సొల్లు కబుర్లు చెబుతుందే అని అందరికీ అర్థం అవుతున్నా.. సదరు హీరోయిన్ మాత్రం బిల్డప్ విషయంలో అసలు తగ్గదు. అయినా ఈ హీరోయిన్లంతా ఇలాంటి కహానీలు చెబుతూనే ఉంటారు. కాకపోతే, అవి బాధను అణుచుకోవడానికి చెబుతారు, చూసే జనానికి మాత్రం కామెడీగా అనిపిస్తాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం బిల్డప్ కి పోయి.. చివరకు […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 02:19 PM IST
    Follow us on

    Nidhi Agarwal: ఛాన్స్ లు లేక ఖాళీగా కూర్చునే హీరోయిన్లు చెప్పే బిల్డప్ మాటలు భలే కామెడీగా ఉంటాయి. పాప సొల్లు కబుర్లు చెబుతుందే అని అందరికీ అర్థం అవుతున్నా.. సదరు హీరోయిన్ మాత్రం బిల్డప్ విషయంలో అసలు తగ్గదు. అయినా ఈ హీరోయిన్లంతా ఇలాంటి కహానీలు చెబుతూనే ఉంటారు. కాకపోతే, అవి బాధను అణుచుకోవడానికి చెబుతారు, చూసే జనానికి మాత్రం కామెడీగా అనిపిస్తాయి.

    Nidhi Agarwal

    హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం బిల్డప్ కి పోయి.. చివరకు సక్సెస్ ఫుల్ గా కామెడీని పండిస్తోంది. అమ్మడు కోసం చాలామంది దర్శకులు ప్రత్యేక పాత్రలు రాస్తున్నారట. మరి ఎవరో ఆ ప్రత్యేక దర్శకులు. ఆమె కోసం పాత్రలు రాస్తే.. వారికీ సినిమా ఇండస్ట్రీలో పాత్ర ఉండదు అని నెటిజన్లు కూడా నిధి పై సెటైర్లు వేస్తున్నారు.

    అయినా, నిధికి ఈ మధ్య ఇలాంటి బిల్డప్ మాటలు ఎక్కువైపోయాయి. ఆ మధ్య హిందీ ఆడియన్స్ తనను రారమ్మని పిలుస్తున్నారని, తనను హిందీ దర్శక నిర్మాతలు కూడా బాలీవుడ్ లో సినిమా చేయాల్సిందిగా కోరుకుతున్నారని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే.. హిందీలో నిధిని పలకరించే వారే లేరు. ముంబై ఎయిర్ పోర్ట్ లో నేను ఫోజులు ఇస్తాను రండీ అని కెమెరామెన్స్ ను పిలవాల్సి వచ్చింది.

    అది నిధి అగర్వాల్ కి హిందీలో ఉన్న డిమాండ్. నిజానికి హిందీ సినిమాతోనే నిధి అగర్వాల్ తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. అయితే హిందీ డెబ్యూ నిధి అగర్వాల్ కి ఏ మాత్రం కలిసి రాలేదు. దాంతో ఇక అక్కడ అన్నీ సర్దుకొని తెలుగు సినిమాల్లోకి వాలింది. మొదట అక్కినేని హీరోల సరసన వరుస గా నటించింది. అయినా అదృష్టం ఆమె చెంతకు చేరలేదు.

    Also Read: Rashmika: నెటిజన్​ కామెంట్​కి దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చిన రష్మిక

    ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా ‘సవ్యసాచి’, అది పెద్ద డిజాస్టర్ అయింది. ప్రస్తుతం నిధి చేతిలో హరిహర వీరమల్లు సినిమా ఉంది. మరి ఆ సినిమా హిట్ అయితేనే నిధికి నాలుగు అవకాశాలు వస్తాయి. లేదంటే.. ఇక్కడ కూడా అన్నీ సర్దుకోవాల్సి వస్తోంది.

    Also Read: Radheshyam: రాధేశ్యామ్​ నుంచి సంచారి ఫుల్​సాంగ్​ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు

    Tags