https://oktelugu.com/

Rashmika: నెటిజన్​ కామెంట్​కి దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చిన రష్మిక

Rashmika: చలో సినిమాతో  తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అతి తక్కువ సమయంలోనే నేషనల్​ క్రష్​గా మారిన హీరోయిన్​ రష్మిక. కొంత మంది లక్కీ బ్యూటీ అని కూడా అంటారు.  ఛలో సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి వరుసగా  అవకాశాలు క్యూకట్టాయి. అప్పటినుంచే తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. విజయ్​ దేవరకొండ నటించిన గీతాగోవందం, డియర్ కామ్రెండ్​ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుని.. ఆతర్వాత స్టార్ హీరోలతో జతకట్టింది. మహేశ్​బాబు నటింటిన సరిలేరు నీకెవ్వరు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 02:01 PM IST
    Follow us on

    Rashmika: చలో సినిమాతో  తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అతి తక్కువ సమయంలోనే నేషనల్​ క్రష్​గా మారిన హీరోయిన్​ రష్మిక. కొంత మంది లక్కీ బ్యూటీ అని కూడా అంటారు.  ఛలో సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి వరుసగా  అవకాశాలు క్యూకట్టాయి. అప్పటినుంచే తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. విజయ్​ దేవరకొండ నటించిన గీతాగోవందం, డియర్ కామ్రెండ్​ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుని.. ఆతర్వాత స్టార్ హీరోలతో జతకట్టింది.

    Rashmika

    మహేశ్​బాబు నటింటిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్​గా కనిపించిన రష్మిక.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్పలో నటిస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా కనిపించనుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్​గా కనిపించనుండగా.. రష్మిక పల్లెటూరి యువతిగా డీగ్లామర్​ లుక్​లో దర్శనమివ్వనుంది. ఈ సినిమా డిసెంబరు 17న విడుదలకు సిద్ధమైంది.

    Also Read: భర్త వదిలేశాక, పాత బంధంలోకి స్టార్ హీరోయిన్ !

    కాగా, రష్మిక తరచూ సోషల్​మీడియాలో యాక్టీవ్​గా ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలనోనే తను నటించిన పుష్ప రేపు విడుదల కానున్న సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామి సామి పాటకు తను ఎంతో కష్టపడినట్లు తెలిపింది. అది చూసి అందరూ ప్రశంసిస్తే చాలంటూ చెప్పిన ఓ వీడియోను రష్మిక తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది.

    ఈ వీడియోపైన ఓ నెటిజన్​ స్పందిస్తూ.. అసలు నిన్ను హీరోయిన్​గా తీసుకోకుండా ఉండాల్సింది.. ఇది చాలా ఓవర్​ అనిపించట్లేదా?.. అని కామెంట్ చేశాడు.. దీనిపి స్పందించిన రష్మిక.. యాక్టింగో.. ఓవరాక్టింగో.. నేను జీవింతో ఏదో ఒకటి సాధించా.. నువ్వు ఏం చేశావ్​ నాన్నా.. అంటూ దిమ్మతిరిగే కౌంట్​ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట్లో వైరల్​గా మారింది.

    Also Read: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !