Diabetes Symptoms: మధుమేహం లక్షణాలేంటో తెలుసా?

Diabetes Symptoms: ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోగుల సంఖ్య రెట్టింపవుతోంది. ప్రతి నలుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి సోకుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర వ్యాధిని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఒకసారి సోకితే ఇక జీవితాంతం దానితో సహజీవనం చేయాల్సిందే. మందులు వాడాల్సిందే. నేచురోపతి విధానంలో మధుమేహాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. దానికి మన కచ్చితమైన అలవాట్లు పాటిస్తే సాధ్యమే అని సూచిస్తున్నారు. […]

Written By: Srinivas, Updated On : November 19, 2022 10:07 am
Follow us on

Diabetes Symptoms: ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోగుల సంఖ్య రెట్టింపవుతోంది. ప్రతి నలుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి సోకుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర వ్యాధిని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఒకసారి సోకితే ఇక జీవితాంతం దానితో సహజీవనం చేయాల్సిందే. మందులు వాడాల్సిందే. నేచురోపతి విధానంలో మధుమేహాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. దానికి మన కచ్చితమైన అలవాట్లు పాటిస్తే సాధ్యమే అని సూచిస్తున్నారు. దీంతో మధుమేహం రోజురోజుకు తన ప్రభావాన్ని పెంచుతోంది.

Diabetes Symptoms

అసలు షుగర్ రావడానికి కారణాలేంటి? ఎందుకు మనకు వస్తుంది? అంటే మన దేహంలో తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాకపోతే అవి గ్లూకోజ్ గా మారతాయి. అదే చక్కెరగా పిలుస్తారు. ఇన్సులిన్ పనితీరు మందగిస్తే మధుమేహం వస్తుంది. ఇన్సులిన్ గ్రంథి సక్రమంగా పనిచేస్తే షుగర్ వ్యాధి రాదు. కానీ మనలో చాలా మందిలో ఆహార అలవాట్లతోనే షుగర్ వస్తోంది. దీంతో జీవితాంతం మందులు మింగుతూ కాలం గడపాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. మాయదారి షుగర్ మాకే రావాలా? అని నిట్టూరుస్తున్నారు.

మధుమేహం వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి. కొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. చక్కెర వ్యాధి వచ్చిందంటే అతిగా ఆకలి వేయడం, అతిగా దాహం వేయడం, అతిగా మూత్ర విసర్జనకు వెళ్లడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందరిలో అన్ని లక్షణాలు కనిపించవు. ఏదో ఒక లక్షణం మాత్రమే కనిపిస్తుంది. దీంతో మనం వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటే మంచిది. లేదంటే షుగర్ వ్యాధితో ప్రాణాలకే ప్రమాదం. దీంతో చాలా మంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా వ్యాధి మాత్రం ఆగడం లేదు.

Diabetes Symptoms

షుగర్ రావడానికి ప్రధాన కారణం అన్నం. ప్రతి రోజుమూడు పూటలు అన్నం తింటే మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం మూడు పూటలు కాకుండా ఒకపూట అన్నం రెండు పూటలు చపాతి, ఏదైనా టిఫిన్ తీసుకుంటే ఉత్తమం. కానీ మనవారు చెబితే వింటారా? అన్నానికే బాగా ఆకర్షితులవుతున్నారు. అన్నం ముద్ద లేనిదే వారికి నిద్ర పట్టదు. ఫలితంగా షుగర్ బారిన పడి మూలుగుతున్నారు. షుగర్ వ్యాధి పెద్ద జబ్బు మాత్రం కాదు. నివారణ కోసం పలు చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. మనవారు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోరు. వ్యాధిని దూరం చేసుకోరు. దాంతోనే సహజీవనం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

Tags