Winter Precautions: శీతాకాలం వచ్చేసింది. చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో దాని నుంచి బయట పడేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వెటర్లు వేసుకుంటూ చలి నుంచి రక్షించుకుంటున్నారు. చలికాలంలో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. అందుకే వేడి పదార్థాలు తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఈ కాలంలో చర్మం పొడిబారిపోతుంది. దీంతో కూడా మనకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలుండటంతో కొన్ని క్రీములు వాడితే ప్రయోజనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో చలి నుంచి పిల్లలు, వృద్ధులు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిందే.

చలికాలంలో అందరు వేడినీటితో స్నానం చేస్తుంటారు. వేడి నీరు కాకుండా చల్లని నీటితో స్నానం చేస్తేనే మంచిది. కానీ ఎవరు కూడా అంతటి ధైర్యం చేయరు. బాగా వేడి నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. వేడినీటితో స్నానం చేస్తే మన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉన్నా పట్టించుకోరు. చర్మం పొడిబారిపోతుంది. దీంతో వేడి నీరు కాకుండా చల్లని నీరుతో స్నానం చేయడానికి మొగ్గు చూపితే మంచిదే. కానీ చల్లని నీరంటే ఎవరు కూడా ముందుకు రారు.
చలికాలంలో చల్లని పదార్థాలు తినకూడదు. చల్లారిన ఆహారాన్ని తింటే త్వరగా జీర్ణం కాదు. అందుకే వేడి పదార్థాలు తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. వీలైనంత వరకు వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. చలికాలంలో తిండి మీద శ్రద్ధ పెట్టాల్సిందే. లేకపోతే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చలికాలం కావడంతో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో నీరు తాగడానికి ఇష్టపడరు. కానీ సాధ్యమైనంత వరకు నీరు తాగితేనే మంచిది. చర్మం పొడిబారకుండా చేయడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కొందరు మేకప్ వేసుకుని అలాగే నిద్రపోతారు. ఇది కూడా మంచిది కాదు. చర్మానికి హాని కలిగిస్తుంది. నిద్రకు ఉపక్రమించే ముందే ముఖాన్ని కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకుని పడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. చర్మ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం. చర్మాన్నా కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలి. శీతాకాలంలో మన ఆరోగ్యం పాడుకాకుండా కాపాడుకునే క్రమంలో పైన సూచించిన జాగ్రత్తలు తీసుకుని రక్షణ చర్యలు చేపడితేనే మనకు రక్షణ కలుగుతుంది. దీంతో కాలానుగుణంగా వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని మసలుకుంటే లాభం.