https://oktelugu.com/

Mahesh Babu: ఫ్యాన్స్… మహేష్ నుండి అలాంటి సినిమాలు ఆశించకండి

Mahesh Babu: సినిమా అనేది అతిపెద్ద ఎంటర్టైన్మెంట్. ఎవరు సినిమా తీసినా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తారు. మెజారిటీ వర్గాల అభిరుచికి తగ్గట్టుగా రూపొందిస్తారు. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే స్టార్ హీరోల చిత్రాల మెయిన్ టార్గెట్ మాస్ ఆడియన్స్. ఈ కళాత్మక వ్యాపారంలో లాభాల లెక్కలు చాలా అవసరం. అందుకే స్టార్స్ ప్రయోగాల జోలికి పోరు. అభిమానులు, ఆడియన్స్ తమ నుండి ఏమి ఆశిస్తున్నారో… అదే సినిమాల్లో ఉండేలా జాగ్రత్త పడతారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 6, 2021 / 09:59 AM IST
    Follow us on

    Mahesh Babu: సినిమా అనేది అతిపెద్ద ఎంటర్టైన్మెంట్. ఎవరు సినిమా తీసినా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తారు. మెజారిటీ వర్గాల అభిరుచికి తగ్గట్టుగా రూపొందిస్తారు. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే స్టార్ హీరోల చిత్రాల మెయిన్ టార్గెట్ మాస్ ఆడియన్స్. ఈ కళాత్మక వ్యాపారంలో లాభాల లెక్కలు చాలా అవసరం. అందుకే స్టార్స్ ప్రయోగాల జోలికి పోరు. అభిమానులు, ఆడియన్స్ తమ నుండి ఏమి ఆశిస్తున్నారో… అదే సినిమాల్లో ఉండేలా జాగ్రత్త పడతారు.

    Mahesh Babu

    కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నుండి ఫ్యాన్స్ పక్కా కమర్షియల్ సినిమాలు కోరుకుంటారు. మహేష్ మూవీ అంటే కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి ఒక ఫుల్ ప్యాక్ వలె ఉండాలి. అయితే మహేష్ కి ప్రయోగాలు చేయడం ఇష్టం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. కానీ హీరో తన ఇష్టాల ఆధారంగా కాకుండా ప్రేక్షకుల నాడి ఆధారంగా సినిమాలు చేయాలి. ప్రస్తుతం మహేష్ అదే ఫాలో అవుతున్నారు.

    ఇప్పట్లో ప్రయోగాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని మహేష్ తేల్చి చెప్పారు. మనతో సినిమా చేసిన నిర్మాతకు డబ్బులు రావాలి. అదే సమయంలో అభిమానులు, ఆడియన్స్ ని సంతృప్తి పరచాలి. కాబట్టి కమర్షియల్ చిత్రాలు చేయడమే మంచిది. ప్రయోగాలు ఫలితం ఇవ్వకపోతే, ఫ్యాన్స్ ని నిరాశపరిచిన వాళ్ళము అవుతామన్న అభిప్రాయాన్ని మహేష్ వెల్లడిస్తున్నారు.

    కెరీర్ లో మహేష్ కొన్ని ప్రయోగాలు చేశారు. తన ఇమేజ్ నుండి బయటికి వచ్చి కొత్తగా ట్రై చేసిన ప్రతిసారి దెబ్బతిన్నారు. నిజం, నాని, స్పైడర్ ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చిత్రాలు. నిజం యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. నాని, స్పైడర్ డిజాస్టర్స్ అయ్యాయి. మహేష్ కెరీర్ లో అత్యధికంగా నష్టాలు మిగిల్చిన చిత్రంగా స్పైడర్ ఉంది.

    Also Read: Upasana: దత్తత తీసుకున్న రాంచరణ్ భార్య ఉపాసన .. అంతా షాక్

    ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా హాజరైన మహేష్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇప్పటి స్టార్ హీరోల మధ్య మంచి రిలేషన్ ఉందని. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు స్టార్స్ తో కూడిన మల్టీస్టారర్స్ చూస్తారు అన్నారు. ఎన్టీఆర్ తో కలిసి తాను సినిమా చేసే అవకాశం కలదని చెప్పడం, అభిమానులను, సినీ ప్రియులను ఆనందపరిచే అంశమే.

    Also Read: Unstoppable Show: బాలయ్య “అన్ స్టాపబుల్” షో కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు…

    Tags