https://oktelugu.com/

RK Mark: ఆర్కే మార్క్.. జగన్ తో ఏపీ భవిష్యత్ నాశనమే..!

RK Mark: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రతీ ఆదివారం ‘కొత్త పలుకు’ పేరిట ఓ సంపాదకీయాన్ని తన పత్రికలో ప్రచురిస్తుంటారు. తనదైన శైలిలో తాజా రాజకీయ సంఘటనలపై సునిశిత పరిశీలన చేస్తుంటారు. అయితే ఆయన వార్తలన్నీ ఇటీవలీ కాలంలో కేవలం యాంటీ జగన్ గానే ఉండటం శోచనీయంగా మారుతోంది. చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు భజనకే ప్రాధాన్యం ఇచ్చిన రాధాకృష్ణ ఇప్పుడు మాత్రం ప్రభుత్వ మూలాల్లోకి వెళ్లి మరీ లోటుపాట్లపై సుదీర్ఘంగా విశ్లేషిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రాధాకృష్ణ వార్తలు […]

Written By: , Updated On : December 6, 2021 / 09:53 AM IST
Follow us on

RK Mark: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రతీ ఆదివారం ‘కొత్త పలుకు’ పేరిట ఓ సంపాదకీయాన్ని తన పత్రికలో ప్రచురిస్తుంటారు. తనదైన శైలిలో తాజా రాజకీయ సంఘటనలపై సునిశిత పరిశీలన చేస్తుంటారు. అయితే ఆయన వార్తలన్నీ ఇటీవలీ కాలంలో కేవలం యాంటీ జగన్ గానే ఉండటం శోచనీయంగా మారుతోంది. చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు భజనకే ప్రాధాన్యం ఇచ్చిన రాధాకృష్ణ ఇప్పుడు మాత్రం ప్రభుత్వ మూలాల్లోకి వెళ్లి మరీ లోటుపాట్లపై సుదీర్ఘంగా విశ్లేషిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

RK Mark

RK Mark

రాధాకృష్ణ వార్తలు చూస్తుంటే జగన్ హయాంలో ఏపీ తగలబడిపోతుందా? అన్న అనుమానాలు రాకమానదు. అంతలా ఆయన తన వ్యాసాల్లో మసాలాను వడ్డివారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని.. అర్జెంటుగా ఆయన దిగిపోయి చంద్రబాబు సీఎం కావాలన్న రీతిలో ఆయన సంపాదకీయాలు ఉంటున్నాయి. ఏపీ ప్రజలకు చంద్రబాబును గెలిపించడం తప్ప మరో ఆప్షన్ లేదన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

ఇందులో భాగంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం రాధాకృష్ణ అస్త్రంగా వాడేస్తున్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను పోల్చిచూస్తున్నారు. చంద్రబాబు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తే రాజశేఖర్ రెడ్డి సంక్షేమాన్ని నమ్ముకున్నారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మిగిలిన రంగాలకు కూడా పట్టించుకునే వారన్నారు. అయితే జగన్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు. ఆయన అభివృద్ధిని గాలికొదిలేసిన కేవలం పంచుడు కార్యక్రమానికి పెద్దపీఠ వేస్తున్నారని తన సంపాదకీయంలో చెప్పకనే చెబుతున్నారు.

గతంలో ఇదే రాధాకృష్ణకు రాజశేఖర్ రెడ్డిలో సంక్షేమం కంటే అవినీతి ఆరోపణలే కన్పించాయి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్ అవినీతిపైనే ప్రధానంగా వార్తలను ప్రచురించింది. ఈ వార్తలను నాడు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టిన విషయం తెల్సిందే. జగన్ రెండున్నరేళ్ల పాలనలోనే రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయిందని రాసుకొచ్చారు. గత 66 ఏళ్లుగా ఏపీలో చేసిన అప్పులన్నింటినీ జగన్ కేవలం రెండేళ్లనే చేశారన్నట్లు రాసుకొచ్చారు.

Also Read: Jagan KCR: జగన్‌ విధానాలను కాపీ కొడుతున్న కేసీఆర్‌!

ప్రజల్లోనూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజులో వ్యతిరేకత ఉందని.. నెక్ట్ సీఎం చంద్రబాబేనని కూడా ఆయన తేల్చేస్తున్నారు. నాడు జగన్ రావాలి అన్నవారే నేడు పోవాలి అంటున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని కాపాడాలంటే చంద్రబాబే దిక్కని ఆయన వార్తల సారంశంగా కన్పిస్తోంది.జగన్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలియదుగానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం జగన్ వ్యతిరేకత బాగానే కన్పిస్తోందని పాఠకులు చర్చించుకుంటున్నారు.

మొత్తంగా ఆర్కే ‘కొత్త పలుకు’ కాస్తా జగన్ విషయంలో వక్రపలుకుగా మారుతుందనే విమర్శలు వెల్లువెతున్నాయి. దీంతో ఏపీలో ప్రతిపక్ష పాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణనే బాగానే చేస్తున్నారనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. మరీ దీనిపై ఆర్కే తన ‘కొత్తపలుకు’లో ఏం చెబుతారే వేచిచూడాల్సిందే..!

Also Read: Jagan Mohan Reddy’s Big Blunder: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?