https://oktelugu.com/

అసలు నీ బాధేంటి సమంత… గుమ్మడికాయల దొంగ ఎవరంటే..!

Samantha: సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. మీడియాకు, జనాలకు ఇది ఓల్డ్ టాపిక్. ఈ అంశంపై ప్రస్తుతం ఎవరికీ ఆసక్తి లేదు. విడాకుల ప్రకటనకు ఓ నెల ముందు, నెల తర్వాత ఇది హాట్ టాపిక్ గా నడిచింది. మీడియాలో వరుస కథనాలతో పాటు జనాలు ప్రముఖంగా మాట్లాడుకున్నారు. సమంత-చైతూ విడాకులకు కారణాలు ఇవేనంటూ అనేక పుకార్లు, ఉహాగానాలు తెరపైకి రావడం జరిగింది. ఈ బ్రేకప్ ఎపిసోడ్ లో సమంతనే జనాలు టార్గెట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 6, 2021 / 10:09 AM IST
    Follow us on

    Samantha: సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. మీడియాకు, జనాలకు ఇది ఓల్డ్ టాపిక్. ఈ అంశంపై ప్రస్తుతం ఎవరికీ ఆసక్తి లేదు. విడాకుల ప్రకటనకు ఓ నెల ముందు, నెల తర్వాత ఇది హాట్ టాపిక్ గా నడిచింది. మీడియాలో వరుస కథనాలతో పాటు జనాలు ప్రముఖంగా మాట్లాడుకున్నారు. సమంత-చైతూ విడాకులకు కారణాలు ఇవేనంటూ అనేక పుకార్లు, ఉహాగానాలు తెరపైకి రావడం జరిగింది.

    Samantha

    ఈ బ్రేకప్ ఎపిసోడ్ లో సమంతనే జనాలు టార్గెట్ చేశారు. ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఆధారంగా… విడాకులకు సమంత ప్రవర్తనే కారణమని తేల్చారు. దీనిపై సమంత న్యాయపోరాటం కూడా చేయడం జరిగింది. నిరాధార కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్ట్ హెచ్చరించింది. ప్రస్తుతం సమంత విడాకుల గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్ నడవడం లేదు.

    అయితే సమంత ఈ వ్యవహారాన్ని అస్తమానం గెలకడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ప్రక్క నాగ చైతన్య సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటే.. సమంత పరోక్షంగా ఆయనను టార్గెట్ చేస్తుంది. సమంత సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. లోతైన అర్థాలతో కూడిన కొటేషన్స్ షేర్ చేస్తూ జనాలలో తాను నిర్దోషి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే క్రమంలో సమంత తీరు చూసిన కొందరు గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటుంది అంటున్నారు.

    జనాలు మర్చిపోతున్న ఆమె విడాకుల టాపిక్ ని సమంత సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా గుర్తు చేస్తున్నారు.బహుశా నాగ చైతన్య చెడ్డవాడు… బంగారం లాంటి సమంతను వదులుకున్నాడని.. సమాజం చెప్పుకోవాలనేది ఆమె అంతిమ లక్ష్యం కావచ్చు. ఏది ఏమైనా తప్పు ఎవరిదైనా… విడిపోయాక ఈ బ్లేమ్ గేమ్ వదిలేసి ఎవరి దారిన వాళ్ళు ఉంటే బెటర్. నాగ చైతన్య అదే చేస్తుండగా.. సమంత మాత్రం ముగిసిన కథలో కొత్త కోణాలు జనాలకు పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తుంది.

    Also Read: Unstoppable Show: బాలయ్య “అన్ స్టాపబుల్” షో కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు…

    కాగా నాగ చైతన్య ప్రస్తుతం బంగార్రాజు, థ్యాంక్యూ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. సమంత ఇటీవల పుష్ప ఐటెం సాంగ్ షూట్ లో పాల్గొన్నారు. రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించిన ఆమె నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

    Also Read: Upasana: దత్తత తీసుకున్న రాంచరణ్ భార్య ఉపాసన .. అంతా షాక్

    Tags