Divyela Madhuri Comments On Pawan Kalyan: వైసీపీ పార్టీ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన వారిలో ఒకరు దువ్వాడ శ్రీనివాస్. ఎన్నికలకు ముందు ఈయన మాజీ సీఎం జగన్ కోసం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), చంద్రబాబు, లోకేష్ వంటి వారిపై ఏ రేంజ్ లో కామెంట్లు విసిరాడో మనమంతా చూసాము. పవన్ కళ్యాణ్ కి అయితే నేరుగా మీడియా ముందుకొచ్చి చెప్పులు చూపించాడు. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇతనిలో ఫైర్ బాగా తగ్గిపోయింది. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి లోకేష్ కి సపోర్టుగా మాట్లాడిన మాటలను చూసిన జగన్, అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసాడు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఏ పార్టీ లోనూ లేడు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇక ఆయన సతీమణి దివ్వెల మాధురి రీసెంట్ గానే బిగ్ బాస్ 9 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.
మూడు వారాల తర్వాత ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఉన్నన్ని రోజులు తన మనసుకి నచ్చినట్టుగానే ఉన్నింది. కంటెస్టెంట్స్ అందరిని గడగడలాడించింది. బయటకు వచ్చిన తర్వాత ఎన్నో మాట్లాడింది. భరణి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడే తనూజ తో టాప్ 5 లో ఉందిస్తామని స్టార్ మా యాజమాన్యం అతనికి చెప్పినట్టుగా చెప్పాడని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. తీరా చూస్తే సరిగ్గా ఆయన టాప్ 6 స్థానం లో ఎలిమినేట్ అయ్యాడు. దీంతో మాధురి చెప్పిన మాటలు అబద్దం అని తేలింది. అంతే కాకుండా రీతూ చౌదరి , డిమోన్ పవన్ లు కలిసి ఉండడం రీతూ వాళ్ళ అమ్మకు నచ్చలేదని తనకు కాల్ చేసి చెప్పినట్టుగా దివ్వెల మాధురి బిగ్ బాస్ షో లో అంటుంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని రీతూ చౌదరి తల్లి ఈమధ్యనే చెప్పుకొచ్చిన విషయాన్నీ మనం గమనించొచ్చు.
ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా ఈమె ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద అభిమానిని, ఆయన ముక్కు సూటితత్వం, సహాయం చేసే గుణం, అన్నీ నాకు చాలా ఇష్టం . ఒకవేళ ఆయన టీడీపీ పార్టీ తో కలవకపోయుంటే కచ్చితంగా నేను జనసేన పార్టీ లో చేరేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ కచ్చితంగా మంచి మనిషి. జనాలకు ఎదో ఒకటి చెయ్యాలనే తపన ఉన్న మనిషి’ అంటూ చెప్పుకొచ్చాడు. వీళ్ళిద్దరిలో అకస్మాత్తుగా కలిగిన ఈ జ్ఞానోదయాన్ని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
View this post on Instagram