https://oktelugu.com/

మెగా ఫ్యామిలీలో సెటిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ !

తెలుగింటి సొట్ట బుగ్గల సోయగం “దివి వధ్య”… బిగ్ బాస్ సీజన్లో 4 లో తన ఆటిట్యూడ్ తో,అందంతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ లోకి ఎప్పుడో అడుగు పెట్టినా, నటిగా నిరూపించుకోవటానికి సరైన ఆఫర్స్ అందుకోలేకపోయింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆమె ఊహించని రీతిలో పాపులర్ అయింది. ఇప్పుడు వరుసగా ఆఫర్లు అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. బిగ్ బాస్ ఫైనల్ లో స్వయంగా మెగాస్టార్ చిరు తన సినిమాలో ఒక పాత్ర […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 09:43 AM IST
    Follow us on


    తెలుగింటి సొట్ట బుగ్గల సోయగం “దివి వధ్య”… బిగ్ బాస్ సీజన్లో 4 లో తన ఆటిట్యూడ్ తో,అందంతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ లోకి ఎప్పుడో అడుగు పెట్టినా, నటిగా నిరూపించుకోవటానికి సరైన ఆఫర్స్ అందుకోలేకపోయింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆమె ఊహించని రీతిలో పాపులర్ అయింది. ఇప్పుడు వరుసగా ఆఫర్లు అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. బిగ్ బాస్ ఫైనల్ లో స్వయంగా మెగాస్టార్ చిరు తన సినిమాలో ఒక పాత్ర దివికి ఇస్తానని మాట ఇచ్చారు. తాజాగా మరో క్రేజీ మూవీలో ఆమెకి ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

    Also Read: తప్పుకున్న రానా.. కారణం అదే..

    వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న కొత్త చిత్రంలో దివికి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. మలయాళం మూవీ `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ గా తెలుగులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా ప్రధాన పాత్రలలో రానున్న మూవీలో ఓ పాత్ర కోసం దివిని సంప్రదించారట. పవర్ స్టార్ సినిమా , మంచి రోల్ కావడంతో దివి కూడా ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

    Also Read: ‘ఆచార్య’ మూవీలోని మరో రహస్యాన్ని బయటపెట్టిన చిరంజీవి

    మెగా ఫామిలీ నుండి వచ్చిన ఈ ఆఫర్లతో దివి ఫుల్ ఖుషీగా ఉందట. ఇవే కాకుండా ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసిందట. వీటితో పాటు కొన్ని చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మన తెలుగమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో ఆఫర్స్ అందుకోవటం గర్వించదగిన విషయం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్