ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మార్టూరుకు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆడి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగుురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పర్వతనేని వెంకటలక్ష్మి, ఆర్. కనకమహాలక్ష్మి, బలిజ సత్యనారాయణ, హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన ఊయ్యూరు చినబాబు, సందీప్ లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్ట నిమిత్తం సమీప ఆసుపత్రికి పంపించారు. కాగా మరి కొందరు గాయపడగా చికిత్స నిమిత్తం వారికి ఆసుపత్రికి తరలించారు.