Akhanda 2 : ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో బాలయ్య బాబుకు మంచి క్రేజ్ అయితే ఉంది. వరుసగా నాలుగు విజయాలను సాధించడంతో బాలయ్య తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుక వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా ఈ ఏజ్ లో కూడా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మాస్ సినిమా వస్తుంది అనగానే బాలయ్య బాబు(Balayya Babu) మాత్రమే గుర్తుకొస్తాడు. ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో ఆయన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న బాలయ్య బాబు ఇప్పుడు ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాతో మరో సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు…ఇక బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడానికి రెడీ అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో ప్రకృతి మొత్తాన్ని పొల్యూట్ చేస్తూ కొన్ని కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తారట. వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టడానికి బాలయ్య బాబు తీవ్రమైన ప్రయత్నం చేస్తారట. ఇక అఘోర గెటప్ లో ఉన్న బాలయ్య అందరికీ బుద్ధి చెబుతూ ముందుకు సాగుతారట. ఇక డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న బాలయ్య మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి సూపర్ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో అఘోర పాత్ర కాకుండా ఇండివిజువల్ గా ఉన్న బాలయ్య పాత్ర చనిపోతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ క్యారెక్టర్ చనిపోయిన తర్వాతే అఘోర క్యారెక్టర్ సమాజంలోకి వస్తుందట.
అప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి. బాలయ్య ఈ సినిమాతో మరొక మెట్టు పైకి ఎక్కే విధంగా తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య బాబు సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయం మనందరికి తెలిసిందే.
వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతుంది. కాబట్టి వీళ్ళ కాంబోలో సినిమా వస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది అందరి మైండ్ లో ముద్ర పడిపోయింది.
ఇక ఈ సినిమా రావడమే ఆలస్యం ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో ఇంతకుముందు సింహా, లెజెండ్,అఖండ లాంటి హ్యాట్రిక్ విజయాలు వచ్చాయి. మరి వాటన్నింటిని తలదన్నే విధంగా ఈ సినిమా ఉండబోతుందా లేదా అనేది…