Top Directors: రాజమౌళి తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న డైరెక్టర్లు..

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరి చూపులు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు రాజమౌళి. ఈ ఒక్క మూవీతో ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.

Written By: Suresh, Updated On : November 8, 2023 2:01 pm

Top Directors

Follow us on

Top Directors: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరి చూపులు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు రాజమౌళి. ఈ ఒక్క మూవీతో ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జక్కన్నకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి రాజమౌళి స్థానం తర్వాత సౌత్ నుంచి మరెవరిది అనే ప్రశ్న అందరిని వెంటాడుతుంది. అయినా రాజమౌళిని టచ్ చేసే దర్శకులు ఎవరు ఎంతమంది ఉన్నారు? అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

అందరి దర్శకులలో ముగ్గురి పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో సుకుమార్, లోకేష్ కనకరాజు, ప్రశాంత్ నీల్. ఆ తర్వాత మణిరత్నం, శంకర్. అయితే ఈ సీనియర్ దర్శకుల్ని పక్కనపెడితే నేటి తరం దర్శకులలో ఈ ముగ్గురు రాజమౌళిలా గ్రేట్ అనిపించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారట. ఈ ముగ్గురిలో సుకుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యారు.

ఆ తర్వాత కేజీఎఫ్ ప్రాంచైజీ తో ప్రశాంత్ నీల్ కూడా భారీగా ఫేమస్ అయ్యారు. ఆ సినిమా రెండు భాగాలు పాన్ ఇండియా ని షేక్ చేసి కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. తదుపరి డైరెక్టర్ లోకేష్ కనకరాజు విక్రమ్, ఖైదీ లాంటి రెండు విజయాలు లోకేష్ కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును తెచ్చి పెట్టాయి. అతనితో పనిచేయడానికి అన్ని పరిశ్రమల హీరోలు క్యూ కడుతున్నారు. అయితే ఈ వరుసలో డైరెక్టర్ అట్లీని చేర్చడం సమజసం కాదన్న విమర్శలు ఉన్నాయి. జవాన్ లాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా అదంతా కేవలం షారుఖ్ ఖాన్ ఇమేజ్ వల్ల సాధ్యమైంది తప్ప అట్లీ క్రియేటివిటీతో కాదని ఒక విమర్శ కూడా ఉంది. కాబట్టి అట్లీని వాళ్ల సరసన చేర్చడం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.