https://oktelugu.com/

Venky Kudumula: మా నిర్లక్ష్యం వల్ల జీవితం కోల్పోయాం అంటూ వెంకీ కుడుముల వైరల్ పోస్ట్

చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఇంతకీ ఏం జరిగింది? తప్పేంటి అనుకుంటున్నారా. డైరెక్టర్ వెంకీ కుడుముల రాసిన ట్వీట్ ను మీరు కూడా చదివేయండి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 8, 2023 / 02:08 PM IST

    Venky Kudumula

    Follow us on

    Venky Kudumula: టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల గురించి తెలిసిందే. ఈయన సినిమాలకు సంబంధించిన వార్తల వల్ల వార్తల్లో నిలుస్తుంటాడు. కానీ తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ చేసి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. సినిమాల గురించి మాట్లాడుతూ హిట్ ఫ్లాప్ ల వల్ల డైరెక్టర్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. కానీ కొన్ని సార్లు మాత్రమే పర్సనల్ విషయాల వల్ల వైరల్ అవుతుంటారు. ఇప్పుడు వెంకీ కుడుముల కూడా అదే విధంగా వైరల్ అయ్యారు. ఇంతకీ ఆయన చేసిన పోస్ట్ ఏంటి అనుకుంటున్నారా?

    చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఇంతకీ ఏం జరిగింది? తప్పేంటి అనుకుంటున్నారా. డైరెక్టర్ వెంకీ కుడుముల రాసిన ట్వీట్ ను మీరు కూడా చదివేయండి.. కొన్ని వారాలుగా మా కజిన్ జ్వరంతో బాధ పడుతున్నారు. అది సాధారణ జ్వరమే అనుకున్నారు. దీంతో సమయానికి వైద్యుని వద్దకు వెళ్లలేదు. అది కాస్త అరుదైన జీబీ సిండ్రోమ్ కు దారి తీసింది. సరైన సమయంలో చికిత్స తీసుకొని ఉంటే ఇలా జరిగేది కాదు. ఆలస్యం చేయడం వల్ల జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దు:ఖం మిగిల్చింది. కోవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు.

    దయచేసి జ్వరాన్ని తేలికగా తీసుకోకండి. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. చిన్న జాగ్రత్తలే మన ప్రాణాలను కాపాడుతాయి అని ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ వైరల్ అవడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక వెంకీ హీరో నితిన్ తో కలిసి భీష్మ సినిమాను తెరకెక్కించారు. మళ్లీ ఇదే కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కించే పనిలో పడ్డారట వెంకీ. మరి చూడాలి ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఎలా సక్సెస్ అవుతుంది అనేది..