కృతి శెట్టిని బాధ పెట్టిన దర్శకుడు !

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ మీద ఎగబడింది కొత్త భామ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఈ కుర్ర భామకి క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ లో భీభత్సమైన పాపులారిటీని సంపాదించుకుంది. పైగా హిట్ సెంటిమెంట్ ఒకటి. అందుకే కృతి శెట్టి తన సినిమాకి బాగా ప్లస్ అవుతుంది అని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ గట్టి నమ్మకంతో ఉన్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా, సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి ప్రస్తుతం ఒక లవ్ […]

Written By: admin, Updated On : June 23, 2021 1:17 pm
Follow us on

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ మీద ఎగబడింది కొత్త భామ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఈ కుర్ర భామకి క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ లో భీభత్సమైన పాపులారిటీని సంపాదించుకుంది. పైగా హిట్ సెంటిమెంట్ ఒకటి. అందుకే కృతి శెట్టి తన సినిమాకి బాగా ప్లస్ అవుతుంది అని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ గట్టి నమ్మకంతో ఉన్నాడు.

కృతి శెట్టి హీరోయిన్ గా, సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి ప్రస్తుతం ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాల కీలకం అట. ఒక విధంగా ఇది కృతి శెట్టి పాత్ర చుట్టూ తిరిగే కథ. అందుకే కృతి శెట్టి కూడా ఈ సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమా కోసం పని చేస్తోందట.

అయితే, ఇంద్రగంటి రాసిన స్క్రిప్ట్ లో కొన్ని సీన్స్ బాగా స్లోగా ఉన్నాయని ఆ సీన్స్ ఎట్టి పరిస్థితుల్లో మార్చాలని సుధీర్ బాబు సన్నిహితుల నుండి వస్తోన్న ఒత్తిడి. కానీ ఆ సీన్స్ ను ఇప్పటికే షూట్ చేశారు. ఆ సీన్స్ కోసం కృతి శెట్టి బాగా కష్ట పడింది. ఇప్పుడు ఆ సీన్స్ ను తీసేసే పరిస్థితి వచ్చే సరికి కృతి ఫీల్ అయిందని తెలుస్తోంది.

అసలుకే ఇంతకుముందు ఇంద్రగంటి ఎన్నో అంచనాలతో తీసిన “వి” సినిమా దారుణంగా అపజయం పాలైంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి. అందుకే కృతి శెట్టికి ఉన్న క్రేజ్ తో గట్టెక్కాలని ఆశ పడుతున్నాడు. ఇలాంటి టైంలో కృతిని హర్ట్ చేస్తే ప్రాజెక్ట్ కే నష్టం వస్తోంది. ఈ సినిమా టైటిల్ ”ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది”.