రాయలసీమ వివాదంలో షర్మిల అటా..? ఇటా..?

వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన తేదీ త్వరలో రాబోతుంది. జూలై 8న ఆమె పార్టీ పేరు పక్రటిస్తానని ఇదివరకు చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగిన ఏర్పాట్లను అభిమానులు చూసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో షర్మిలకు ఓ చిక్కొచ్చి పడింది. ముందు గొయ్యి.. వెనుక నుయ్యి మాదిరిగా ఆమె ఎటూ తెల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల ప్రస్తుతం ఆ పార్టీ లేవనెత్తిన జల వివాదంతో ఇరకాటంలో […]

Written By: NARESH, Updated On : June 23, 2021 1:01 pm
Follow us on

వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన తేదీ త్వరలో రాబోతుంది. జూలై 8న ఆమె పార్టీ పేరు పక్రటిస్తానని ఇదివరకు చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగిన ఏర్పాట్లను అభిమానులు చూసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో షర్మిలకు ఓ చిక్కొచ్చి పడింది. ముందు గొయ్యి.. వెనుక నుయ్యి మాదిరిగా ఆమె ఎటూ తెల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల ప్రస్తుతం ఆ పార్టీ లేవనెత్తిన జల వివాదంతో ఇరకాటంలో పడ్డారని కొందరు అంటున్నారు.

రాజన్న రాజ్యం పేరుతో తెలంగాణలో అభిమానుతో వరుసగా మీటింగ్ లు పెట్టిన షర్మిల ఎప్పుడో పార్టీ స్థాపిస్తారని అనుకున్నారు. అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఆ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం కారణంగా షర్మిలకు తలనొప్పిగా మారింది. తన పుట్టిన ప్రాంతమైన రాయలసీమకు, ప్రస్తుతం రాజకీయంగా ముందుకు వెళుతున్న తెలంగాణకు మధ్య వివాదం తలెత్తడంతో షర్మిల ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతలో పలుసార్లు సమావేశాలు నిర్వహించిన షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు షర్మిలపై ఎవరూ కామెంట్స్ చేయలేదు. అనువైన సమయం కోసం వేచి చూడాలని పార్టీలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారని అందరూ అనుకుంటున్నారు. ఈ వివాదంతో అటు షర్మిల, ఇటు జగన్ ఇద్దరూ ఇరకాటంలో పడ్డారు. ఈ వివాదంపై తమ వైఖరిని ఎలా ప్రదర్శించిన ఏదో ఒక ప్రాంతంలో పట్టు కోల్పోతారు.

అయితే పుట్టిన గడ్డపై ఎలాగూ షర్మిల వ్యతిరేకంగా మట్లాడలేదు. దీంతో ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక రాజకీయంగా ఎదగడం కష్టం. దీంతో షర్మిల రాయలసీమ వివాదం గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివాదం ఎలా మొదలైంది..? దానిపై ఎలా మాట్లాడాలి..? అని సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తోందట. మరి షర్మిల ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.