Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ని గతంలో ఒక స్టార్ డైరెక్టర్ దారుణంగా అవమానించారట. సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక సీన్ కోసం ఆమె లుక్ నచ్చలేదని అందరి ముందే బట్టలు మార్చుకోమని చెప్పారట. ఆ సమయంలో క్యారవాన్ కూడా అందుబాటులో లేకపోవడంతో నయనతార చాలా ఇబ్బంది పడ్డారట. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ లో నయన్ ని లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. గత ఏడాది జవాన్ మూవీతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నయనతార నటనకు గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇప్పుడు మరో హిందీ మూవీలో ఆమె నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం మన్నం గట్టి, టెస్ట్ సినిమాల్లో నయనతార నటిస్తున్నారు.
ఇది పక్కన పెడితే .. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతారకు గజినీ సినిమా షూటింగ్స్ సెట్స్ లో ఎదురైన అనుభవాన్ని ఓ జర్నలిస్ట్ పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ .. ‘ చెన్నై వైఎంసీఏ గ్రౌండ్ లో గజినీ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలో నయనతారని విలన్లు వెంబడించే సన్నివేశాన్ని మురుగదాస్ చిత్రీకరించారు. ఆ సీన్ లో నయనతార పరిగెడుతున్నప్పుడు మురుగదాస్ కట్ చెప్పాడు.
Also Read: ‘చెప్పవే చిరుగాలి’ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఆ సీన్ లో నయనతార ధరించిన చొక్క కాస్త అసభ్యంగా ఉంది. దీంతో మురగదాస్ షర్ట్ అసభ్యకరంగా ఉంది. మరో షర్ట్ వేసుకో అని చెప్పారు. అయితే నయనతార దగ్గర వేరే చొక్కా లేదు. ‘నేను వేరే బట్టలు కూడా తీసుకురాలేదు. కనీసం మార్చుకోవడానికి క్యారవాన్ కూడా లేదు’ అని డైరెక్టర్ తో చెప్పింది. ఇక మురగదాస్ అసిస్టెంట్ వెళ్లి ఒక షర్ట్ కొని తెచ్చాడు. చేసేదేమీ లేక అక్కడ పార్క్ చేసి ఉన్న కార్ వెనక్కి వెళ్లి క్లోసెట్ లో నిలబడి వేరే షర్ట్ వేసుకుంది అని చెప్పుకొచ్చారు. అది ఆమె కెరీర్ బిగినింగ్ లో వచ్చిన సినిమా. నయనతార సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆమెకు ఇప్పుడున్నంత గౌరవం లేదు. ఓ కొత్త హీరోయిన్ లా మురుగదాస్ ట్రీట్ చేశాడని చెప్పొచ్చు.
Web Title: Director who bothered nayanthara to change her clothes on the set
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com