Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. సినీవినీలాకాశంలో తనదైన ముద్ర వేసిన సిరవెన్నెల మరణం.. సాహిత్యాభినులకు, సినీ ప్రియులను శోఖ సంద్రంలో ముంచింది. ఓ గొప్ప కవిని, ఓ గేయ రచయితను కోల్పోయామని యావత్ తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిరివెన్నెల మరణం సినిమా రంగానికి భారీ లోటుగా అభివర్ణిస్తున్నారు. ఆయన మరణ వార్తతో వారి కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ, శ్రేయోభిలాషులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా కళాతపస్వి కె.విశ్వనాథ్, సిరివెన్నెలది విడదీయరాని బంధం.. దశాబ్దాలుగా సాగుతున్న సినీ సంబంధం. సిరివెన్నెలను సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది విశ్వనాథే. సిరివెన్నెల మరణంతో భావోద్వేగానికి గురయ్యారు విశ్వనాథ్.
‘ఇది నమ్మలేని నిజం.. నిజంగా జరిగినా నమ్మలేకుండా ఉన్నాం.. ఇది చాలా పెద్ద లాస్ నాకు.. బాల సుబ్రహ్మణ్యం పోయినప్పుడు కుడి భుజం రాలిపోయిందనుకున్నాను. ఇప్పుడు సిరివెన్నెల పోయిన తర్వాత ఎడమ భుజం కూడా పోయింది. అంత సన్నిహితంగా ఉండి, అంత చక్కగా మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా అంతర్థానమైపోయాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. వాళ్ల కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు విశ్వనాథ్.
Also Read: సిరివెన్నెల గారు మనల్ని వదిలివెళ్ళడం ఎంతో బాధాకరం: రాజమౌళి
విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన సిరివెన్నెల మొదట్లో భరణి పేరుతో కవితలు రాసేవారు. గంగావతరణం కవిత చూసి ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసే అవకాశమిచ్చారు దర్శకుడు కె.విశ్వనాథ్. ‘సిరివెన్నెల’ సినిమాకు అద్భుతమైన పాటలు రాసి ఆ సినిమా విజయంలో కీలక భాగమయ్యారు. దాంతో సీతారామ శాస్త్రి పేరు కాస్తా ‘సిరివెన్నెల’ గా మారిపోయింది. అప్పటి నుండి అదే సినిమా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ‘సిరివెన్నెల’ సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్నారు సీతారామ శాస్త్రి… దర్శకుడు కె.విశ్వనాధ్ అన్ని సినిమాలకు ఆయన పనిచేశారు. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తారు.
Also Read: మన రాకలు, పోకలు మన చేతుల్లో ఉండవు – సిరివెన్నెల సీతారామశాస్త్రి