Pushpa Movie: సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం” పుష్ప”. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , పాటలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read: భీమ్లానాయక్ సాంగ్ రిలీజ్ వాయిదా.. ఆయన మరణించడమే కారణమా?
కాగా ఈ సినిమాలో స్టార్ హిరోయిన్ సమంత ఒక ప్రత్యేక పాట లో కనిపించబోతుంది అని మూవీ యూనిట్ ప్రక్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ పాట గురింకీ చిత్ర బృందం ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ లో సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా త్వరలోనే ఈ పాట మీ ముందుకు రాబోతుంది అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలానే సునీల్, అనసూయ భరద్వాజ్ లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల 17 న పాన్ ఇండియా రెంజ్ లో విడుదల కాబోతుంది.
A Rocking Number with Icon Star @alluarjun & @Samanthaprabhu2 being shot in a gigantic set 🔥
Get ready to witness the 'Sizzling Song of The Year' soon💥#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/Y1PbbAmoIm
— Pushpa (@PushpaMovie) November 30, 2021
Also Read: Akhanda Movie Dialogues, Balayya Babu Akhanda Dialogues