https://oktelugu.com/

సూపర్ హిట్ ఇచ్చినా.. ఇదెక్కడి గోలరా బాబు !

ఇదెక్కడి గోలరా బాబు, సూపర్ స్టార్ తో సూపర్ హిట్ ఇచ్చి.. ఇంకా పడిగాపులు కాయాల్సి వస్తోందే. అసలు నా టైం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా ? హిట్ ఇచ్చాక కూడా సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన దౌర్భాగ్యం ఏమిటి దేవుడా ? ఇవన్నీ దర్శకుడు వంశీ పైడిపల్లి మనసులోని మాటలు. అవును.. తన కొత్త సినిమా ఎప్పుడు? తనకు ఇదొక ఆన్సర్ లేని ప్రశ్నగా మారిపోయింది అనేది వంశీ బాధ. అసలు రెండేళ్ల క్రితం విడుదలైన ‘మహర్షి’ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 12, 2021 / 05:44 PM IST
    Follow us on


    ఇదెక్కడి గోలరా బాబు, సూపర్ స్టార్ తో సూపర్ హిట్ ఇచ్చి.. ఇంకా పడిగాపులు కాయాల్సి వస్తోందే. అసలు నా టైం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా ? హిట్ ఇచ్చాక కూడా సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన దౌర్భాగ్యం ఏమిటి దేవుడా ? ఇవన్నీ దర్శకుడు వంశీ పైడిపల్లి మనసులోని మాటలు. అవును.. తన కొత్త సినిమా ఎప్పుడు? తనకు ఇదొక ఆన్సర్ లేని ప్రశ్నగా మారిపోయింది అనేది వంశీ బాధ.

    అసలు రెండేళ్ల క్రితం విడుదలైన ‘మహర్షి’ తర్వాత ఇప్పటివరకు ఇంకో సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్ళలేకపోయానే అనే ఆక్రోశం. పాపం వంశీ కెరీర్ మొదటినుండి ఇలాగే అవుతుంది. హిట్ ఇచ్చినా స్టార్ హీరోలను వెంటనే ఒప్పించలేకపోతున్నాడు. అసలు మహర్షి లాంటి ఆల్ టైం హిట్ తరువాత మొదట మహేష్ బాబు మళ్ళీ సినిమా ఇస్తానని బహిరంగంగానే చెప్పాడు. తరువాత ఎలాగు హ్యాండిచ్చాడు అనుకోండి.

    ఆ తర్వాత ‘ఎవడు’ కాంబినేషన్ ను ఇంకోసారి సెట్ చేద్దామని రామ్ చరణ్ చుట్టూ తిరుగుతుంటే.. ఈ లోపు చరణ్ వెళ్లి శంకర్ సినిమా ఒప్పుకుని మరో రెండేళ్ళు నో ఖాళి అని తెల్చేశాడు. దాంతో… పైడిపల్లి.. మరో రెండేళ్లు వెయిట్ చెయ్యాలా ? లేక విజయ్ దేవరకొండ , ‘అఖిల్’ లాంటి హీరోస్ తో మరో సినిమా ప్లాన్ చేసుకోవాలా అని తికమక పడుతున్నాడట. ఇంతకీ ఎందుకు ఈ తికమక అంటే… మనోడి దగ్గర పెద్దగా స్క్రిప్ట్స్ లేవు.

    అయినా హిట్ ఇవ్వడమే ఒక్కటే కాదు ‘కథలు’, ‘స్క్రిప్ట్స్’ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా రెడీ చేసుకోని వెళ్తేనే.. హీరోలు వెంటనే డేట్స్ ఇస్తారు… లేదంటే పెద్ద దర్శకులు అయినా వెయిటింగ్ లో పెడతారు. మరి ఇప్పటికైనా పైడిపల్లికి తనలోని సమస్య అర్ధం అవుతుందా ? లేక మరో రెండేళ్ళు ఆగి సినిమా చేస్తాను అంటాడా ? చూద్దాం.