https://oktelugu.com/

కొత్త తెలుగు హీరోయిన్ కి దర్శకుల అభయం !

‘అనన్య నాగళ్ళ’ అంటే పెద్దగా ఎవ్వరికి తెలియదు గానీ, ఈ బ్యూటీ అచ్చ తెలుగు హీరోయిన్. కాకపోతే హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమెలో లేదు అనుకోండి. అందుకే రెగ్యులర్ సినిమాల హీరోయిన్ గా కాకుండా ‘మల్లేశం’ లాంటి ఆర్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ప్రసంశలు అందుకొంది ఈ అమ్మడు. అలాగే రీసెంట్ గా ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో కనిపించి తనలో మంచి నటి ఉందని మరోసారి నిరూపించుకుంది. Also Read: కలర్ ఫుల్ […]

Written By:
  • admin
  • , Updated On : March 12, 2021 / 05:24 PM IST
    Follow us on


    ‘అనన్య నాగళ్ళ’ అంటే పెద్దగా ఎవ్వరికి తెలియదు గానీ, ఈ బ్యూటీ అచ్చ తెలుగు హీరోయిన్. కాకపోతే హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమెలో లేదు అనుకోండి. అందుకే రెగ్యులర్ సినిమాల హీరోయిన్ గా కాకుండా ‘మల్లేశం’ లాంటి ఆర్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ప్రసంశలు అందుకొంది ఈ అమ్మడు. అలాగే రీసెంట్ గా ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో కనిపించి తనలో మంచి నటి ఉందని మరోసారి నిరూపించుకుంది.

    Also Read: కలర్ ఫుల్ గా కనిపించే హీరోయిన్లలో కూడా.. !

    పైగా వచ్చే నెలలో అనన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల అవ్కబోతుంది. ఈ సినిమాలో ఆమె ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. అయితే అంజలి, నివేథాలతో పోల్చుకుంటే ఆమె పాత్ర చాల చిన్నది అని, యాక్టింగ్ కి ఎలాంటి స్కోప్ లేదని, అలాగే ఆమెకు పెద్దగా డైలాగ్స్ కూడా ఉండవు అని టాక్. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి, ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా ఆమె పాపులర్ అవ్వడం గ్యారెంటీ. అందుకే ఈ మధ్య అనన్యకి సినిమాలు పెరుగుతున్నాయట.

    Also Read: హైప్ కోసం సుకుమార్ తప్పుడు పని !

    అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోన్న ఇంట్రస్టింక్ టాక్ ఏమిటంటే.. ఇటీవల అనన్య నటనని చూసి దర్శకుడు హరీష్ శంకర్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. ఎప్పటికైనా ఆమెకి హీరోయిన్ గా తన సినిమాలో ఛాన్స్ ఇస్తాను అని హరీష్ ఆమెకు ఫోన్ చేసి మరీ చెప్పుకోచ్చాడట. మరి హరీష్ శంకర్ మాట ఇచ్చాడు అంటే.. అనన్యకి అవకాశం వచ్చినట్టే. అలాగే అచ్చ తెలుగు అమ్మాయిలకు తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అని ఈ మధ్య సుకుమార్ కూడా చెప్పుకొచ్చాడు. అనన్య నటన సూపర్ గా ఉంది కాబట్టి, ఆమె తెలుగు అమ్మాయి కాబట్టి సుక్కు కూడా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్