Director Teja fined Rs 1 Cr: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ల టాలెంట్ తో సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమలోనే డైరెక్టర్ తేజ మంచి సినిమాలు చేసి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. తన ఎంటైర్ కెరీర్లో చేసిన సినిమాలన్నీ దాదాపు చాలావరకు ఫ్లాపులుగా నిలిచాయి. కెరియర్ మొదట్లో వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించిన ఆయన ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాప్ లను అందుకున్నాడు. ఇక రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మరోసారి టచ్ లోకి వచ్చిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాతో ఏమాత్రం మెప్పించలేకపోయాడు…ప్రస్తుతం రానాతో ‘రాక్షస రాజా’ అనే సినిమాని స్టార్ట్ చేసినప్పటికి ఆ సినిమా బడ్జెట్ పెరిగిపోతుండటం వల్ల సినిమాని తాత్కాలికంగా నిలిపివేశారు…
ఇక రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను గతంలో చేసిన ఒక సినిమా గురించి మాట్లాడుతూ దాసరి గారు తన చేత కోటి రూపాయల పెనాల్టీని కట్టించారట… కారణం ఏంటి అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే తేజ డిస్ట్రిబ్యూటర్లతో ఈ సినిమా ప్లాప్ అవ్వబోతుంది ఎవరు తీసుకోకండి అని చెప్పారట.
దాంతో ఆ సినిమా కొనడానికి పెద్దగా డిస్ట్రిబ్యూటర్లు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ సినిమా ప్రొడ్యూసర్ తేజ మీద ప్రొడక్షన్ కౌన్సిల్లో కంప్లైంట్ చేశాడు. దాంతో సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయింది. ఇక అప్పుడు దాసరి నారాయణ రావు తేజ ను పిలిచి రిలీజ్ కి ముందే మూవీ ప్లాప్ అవుతుందని చెప్పడం తప్పని చెప్పి తన మీద కోటు రూపాయలు పెనాల్టీ వేసి మరి తన చేత కట్టించారట…
ఈ విషయాన్ని చెబుతున్న తేజ తను చాలా హానెస్ట్ గా ఉంటానని అందుకే జెన్యూన్ గా తన ఒపీనియన్ ని చెప్పానని దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే ఉద్దేశంతోనే అలా చేశానని అలా చేయడం కరెక్టో తప్పో తెలియదని మొత్తానికైతే తను నిజాయతీగా ఉండాలనే ఉద్దేశంతో అలా చేశానని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…