Instagram reality check: నేటి కాలంలో ఇంస్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఉంది. ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను ఉపయోగించి ఇందులో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఒక సలహాలు ఇచ్చే ఒక యువతి 40 కోట్ల రాబడిని పొందినట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్టులు పెట్టింది. దీంతో చాలామంది విలువైన తమ ఉద్యోగాలను వదిలి ఆమెలాగా సూచనలు ఇచ్చే వారిగా మారిపోయారు. కొందరైతే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థల్లో పని చేసేవారు కూడా కోట్ల రూపాయల ప్యాకేజీని వదిలిపెట్టి ఆమెలాగా మారిపోతున్నట్లు వీడియోలు పెట్టారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ఒక వ్యక్తి ఒక పనిలో విజయం సాధిస్తే.. చాలామంది అదే పని కోసం ఆరాటపడే మనస్తత్వం మనుషులది. అయితే ఆ పని తమకు సరిపోతుందా? వాళ్లు చేయగలరా? అనే విషయాన్ని మాత్రం ఎవరు ఆలోచించరు. కొన్ని కంపెనీలు ఇలా తమ వైపు తిప్పుకునేందుకు గేమ్స్ ఆడే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చాలామంది తమ వెంట వచ్చేలా ఎదుటివారిని ఆకట్టుకుంటున్నారని చెబుతున్నారు.
అసలు విషయం ఏంటంటే 40 కోట్ల రాబడి సంపాదించిన యువతి గురించి లోతుగా ఆరా తీస్తే.. తన వద్ద రూ. 10 లక్షల కూడా లేవని తేలింది. మరి ఎందుకు అలా చెప్పింది అంటే? ఒక యువతి అంతవరకు సంపాదిస్తుంది అంటే.. ఎవరైనా ఆ రంగం వైపు వెళ్లిపోకుండా ఉంటారా? అలాగే ఒకే చోట కూర్చొని బాగా డబ్బు సంపాదిస్తున్నారంటే కచ్చితంగా ఇతరులు ఆకర్షితులవుతారు. ఈ విధంగా కొన్ని కంపెనీలు ఇతరులను ఆకర్షించడానికి ప్లాన్ వేస్తున్నట్లు చెబుతున్నారు. అంటే తమ సంస్థ లేదా కంపెనీ వైపు వచ్చేలా కొందరితో తమ సంస్థ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ మాయలో కొంతమంది తమ ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలి చేతులు కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ విషయంలో కొందరికి బాగా వర్క్ అవుట్ అవుతుంది కావచ్చు. అంతేకాకుండా అతడు ఎంత రాబడి సాధిస్తున్నాడని విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి.
కేవలం ఈ ఒక్క విషయం మాత్రం కాకుండా.. బాగా డబ్బు సంపాదిస్తున్నామని చెప్పే వారి గురించి ఆలోచించాలి. అతడు నిజంగానే రాబడిని పొందాడా? లేక ఎవరికోసం ఇలా చెబుతున్నాడు? అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఒక రంగం బాగుందని.. ప్రస్తుతమున్న విలువైన ఉద్యోగాన్ని వదులుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ప్రస్తుతం పని చేసే సంస్థ లేదా కంపెనీ గ్రోత్ లేకపోవడం లేదా నచ్చకపోవడము వంటివి జరిగితే.. ఆ తర్వాత సొంత ప్రతిభతో మరో రంగంలో ప్రయత్నించాలి. అంతేకాకుండా ఇతరులు చెప్పే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.