https://oktelugu.com/

Director Teja: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ నాతో చెప్పించాలి అనుకుంటున్నారు… డైరెక్టర్ తేజ కామెంట్స్!

పరాజయాలతో అవకాశాలు తగ్గడం, ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోవడం వంటి కారణాలు ఒత్తిడికి గురి చేశాయి. అందుకే ప్రాణాలు తీసుకున్నాడని ఓ వాదన ఉంది. ఉదయ్ కిరణ్ తో రెండు బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు తేజ గతంలో ఓ కామెంట్ చేశాడు.

Written By:
  • Shiva
  • , Updated On : May 25, 2023 / 10:14 AM IST

    Director Teja

    Follow us on

    Director Teja: హీరో ఉదయ్ కిరణ్ మరణం టాలీవుడ్ మరచిపోలేని విషాదం. పక్కింటి కుర్రాడిలా ఉండే ఉదయ్ కిరణ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఉదయ్ వరుస హిట్స్ ఇచ్చారు. మంచి భవిష్యత్ ఉన్న హీరో అకాల మరణం పొందారు. తన నివాసంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై అనేక వాదనలు ఉన్నాయి.

    పరాజయాలతో అవకాశాలు తగ్గడం, ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోవడం వంటి కారణాలు ఒత్తిడికి గురి చేశాయి. అందుకే ప్రాణాలు తీసుకున్నాడని ఓ వాదన ఉంది. ఉదయ్ కిరణ్ తో రెండు బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు తేజ గతంలో ఓ కామెంట్ చేశాడు. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో నాకు తెలుసు. చచ్చేలోపు అది బయటపెడతాను అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన అహింస మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ మరోసారి స్పందించారు.

    యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… ఉదయ్ కిరణ్ ఎందుకు మరణించాడో అందరికీ తెలుసు. ఎందుకో నాతో చెప్పించాలని అనుకుంటున్నారు. ఏమీ తెలియనట్లు అమాయకంగా నా ముందు నటిస్తున్నారు, అన్నారు. ఉదయ్ కిరణ్ మరణం వెనుకున్న కారణాలు అందరికీ తెలుసని ఆయన స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పుకున్నారు. తేజా డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ చిత్రం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా చిత్రాలు చేశారు. చిత్రం, నువ్వు నేను భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

    ఈ సందర్భంగా తేజ వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. ఆయన కొడుకు డైరెక్షన్ లో కోర్స్ చేశాడట. త్వరలో హీరోగా పరిచయం చేస్తాడట. ఇక కూతురు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చిందట. ఆమెకు తేజా వివాహం చేయడట. నచ్చినవాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో అని చెప్పాడట. పెళ్లయ్యాక భర్తతో ఇబ్బందులు తలెత్తితే విడాకులు తీసుకోమని చెప్పాడట. ఎవరి కోసమో బ్రతకాల్సిన అవసరం లేదు. మన సంతోషమే ముఖ్యమని తేజ ఇద్దరు పిల్లలకు చెప్పాడట.