SV Krishna Reddy :
ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. కానీ దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు అందులో ఎస్ వి కృష్ణారెడ్డి ఒకరు. ఆయన చేసిన సినిమాలే అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలుపాయి. ఒకప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా తప్పకుండా సక్సెస్ ని సాధిస్తోంది అనే రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు…
కెరియర్ మొదట్లో తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఇవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉండేవి. ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వరుసగా కామెడీ ఫ్యామిలీ సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా వీళ్ళ సినిమాల్లో కామెడీతో పాటు ఒక కోర్ ఎమోషన్ అయితే ఉంటుంది. దాన్ని సరిగ్గా పట్టుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్లిన వారిలో వీళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. అయితే ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాని చేస్తున్నప్పుడు అందులో హీరోయిన్ గా మొదట సౌందర్య ను తీసుకోవాలనుకున్నారట… కానీ ఆమె అలీ పక్కన చేయనని చెప్పడంతో ఆమె ప్లేస్ లో వేరొక హీరోయిన్ ను తీసుకోవడానికి ఎస్ వి కృష్ణారెడ్డి తీవ్రమైన ప్రయత్నం అయితే చేశారట. ఒక సినిమా షూటింగ్లో ఉన్న ఇంద్రజని చూసిన ఆయన తన సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ గా సెట్ అవుతుందని అనుకొని ఆమె చేత యమలీల సినిమాలో హీరోయిన్ గా నటింప చేశారు.
మొత్తానికైతే ఆమె ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్ వి కృష్ణారెడ్డి తను హీరోయిన్ ను చూసినప్పుడు స్ట్రక్చర్ చూడకుండా కేవలం ఫేసును మాత్రమే చూస్తానని అలా చూసే హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాడు.
తనకు కావలసిన ఎక్స్ప్రెషన్స్ ఫేస్ ద్వారా మాత్రమే పలుకుతాయని చెప్పాడు. అలాగే కండ్లు ఒక ఎక్స్ప్రెషన్ ని చూపిస్తే నుదురు మరొక ఎక్స్ప్రెషన్ ని చూపిస్తుంది. కాబట్టి ఫేస్ ద్వారా మ్యాజిక్ చేయగలిగే అమ్మాయిలు మాత్రమే తన సినిమాల్లో కనిపిస్తూ ఉంటారని, ఫిజిక్ గానీ, స్ట్రక్చర్ గాని పట్టించుకోనని చెప్పాడు…
కానీ ఇప్పుడున్న చాలామంది దర్శకులు హీరోయిన్ ఎక్స్పోజ్ చేస్తేనే సినిమాకి ఆడియన్స్ థియేటర్ కి వస్తారని ఆలోచించి విపరీతమైన ఎక్స్పోజింగ్ చేయించి సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా ఎస్ వి కృష్ణారెడ్డి పాటించిన విధానం చాలా మంచిదని ఎక్స్పోజ్ చేయడం వల్ల సినిమాలు ఆడవని కథలో దమ్ముంటే మాత్రమే సినిమాలు ఆడతాయని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…