Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్ ని చాలా సులభమైన మరియు సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులతోపాటు ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తాయి. ఎన్నో ఎఫ్డి పథకాలు వివిధ కాల పరిమితులతో అలాగే వివిధ వడ్డీ రేట్లతో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు మీరు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఫిక్స్ డిపాజిట్ లో మీరు పెట్టుబడి పెట్టేముందు మీకు దీర్ఘకాలంలో ఎంత రాబడి వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. ఎందులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ రేటు వస్తుందో ముందుగా తెలుసుకోవడం మంచిది. వివిధ వడ్డీరేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు ఏడు రోజుల నుంచి పది ఏళ్ల వరకు ఉంటాయి. మీ అవసరాలకు తగినట్లుగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఎంచుకోవాలి.
Also Read: రోజాపై మళ్లీ రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ.. వైరల్ వీడియో
దీనికోసం మీరు ఖాతా తెరిచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. వాళ్లు అందిస్తున్న వడ్డీ రేటును మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో ఎంత కాలానికి పెట్టుబడి చేసిన కూడా మీకు మెచ్యూరిటీ సమయానికి ఫిక్స్డ్ వడ్డీ రేటు ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఏ సంస్థలు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కోసం అకౌంట్ తెరుస్తున్నారో అక్కడ ఎఫ్డి పథకానికి కాలపరిమితి ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. అలాగే వేరువేరు బ్యాంకులలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పై ఎంత కాలానికి ఎంత వడ్డీ రేటు ఇస్తున్నారో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా అయితే ఫిక్స్ డిపాజిట్ కాలపరిమితి ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. మీరు కావాలంటే ఫిక్స్ డిపాజిట్ ను మరో 5 ఏళ్ళు పొడిగించుకోవచ్చు.
ఆర్థిక నిపుణుల సలహాల ప్రకారం చూసుకుంటే 13 నెలలు లేదా ఐదు సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు చాలా ఉత్తమమైనవిగా పరిగణిస్తారు.మీరు ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు దానిలో మీకు లభించే ప్రయోజనాల గురించి ముందుగా తెలుసుకోవాలి. కొన్ని ఆర్థిక సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటులతోపాటు లోన్స్ సౌకర్యం కూడా కల్పిస్తాయి. అంటే మీరు కొంతకాలం తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ బై లోన్ కూడా తీసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన ఫిక్స్ డిపాజిట్ మొత్తంలో 75% వరకు మీరు లోన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఫిక్స్ డిపాజిట్ కాలవ్యవధి వరకు మాత్రమే ఈ లోన్ తీసుకునే సౌకర్యం మీకు ఉంటుంది.