Director Sukumar: ‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సుకుమార్(Sukun,తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న రామ్ చరణ్, ఈ చిత్రం పూర్తి అవ్వగానే సుకుమార్ సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు. అయితే తన ప్రతీ సినిమా స్టోరీ ని సిద్ధం చేయడానికి తన రైటింగ్ డిపార్ట్మెంట్ తో కలిసి కూర్చొని ఏడాదికి పైగా సమయం తీసుకునే సుకుమార్, ఇప్పటి వరకు రామ్ చరణ్ సినిమా గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు. ఒక జానర్ ని అనుకున్నారట కానీ, ఇప్పటి వరకు స్టోరీ డెవలప్ చేయలేదు. రీసెంట్ గా దుబాయి కి వెళ్లిన సుకుమార్, అక్కడ రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన స్టోరీ ని సిద్ధం చేస్తున్నాడని కథనాలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సుకుమార్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తం తనతో పాటు ప్రయాణం చేసిన శిష్యుల కెరీర్స్ ని సెట్ చేయడం పైనే ఉందట. సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థ మీద ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఎంతో మంది డైరెక్టర్లు మన టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఇప్పుడు ఆ బ్యానర్ లోనే మరికొంతమంది శిష్యులను ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడట. దుబాయి లో మొన్న వీళ్ళ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన కథల్ని లాక్ చేయడానికే వెళ్ళాడట. సుకుమార్ శిష్యుడు అయినటువంటి వీరా ని కిరణ్ అబ్బవరం తో ఒక సినిమా సెట్ అయ్యేలా చూసాడు. అదే విధంగా మాధురి అనే అమ్మాయికి సుమంత్ ప్రభాస్ తో మరో సినిమాని ఓకే చేసాడు. ఈ రెండు సినిమాలను సుకుమార్ రైటింగ్స్ తో పాటు, ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యంలో నిర్మించనున్నారు.
సుకుమార్ ఇలా తన శిష్యుల కోసం కాలయాపన చేస్తే, రామ్ చరణ్ సినిమా కోసం ఎప్పుడు పనిచేస్తాడు?, స్టోరీ కోసమే సంవత్సరం సమయం తీసుకునే సుకుమార్, దానిని పూర్తి చేయడానికి ఇంకెన్నేళ్ళు తీసుకుంటాడు?, రామ్ చరణ్ చేసిన సినిమాలే తక్కువ, #RRR తర్వాత భారీ గ్యాప్ తీసుకొని ‘గేమ్ చేంజర్’ తో వచ్చాడు. ఈ సినిమా ఎంత ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. ఈ సినిమా తర్వాత పెద్ది వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమా ఒక్కటే తక్కువ గ్యాప్ లో తెరకెక్కిన రామ్ చరణ్ సినిమా అనుకోవచ్చు. ఇప్పుడు సుకుమార్ సినిమా విషయానికి వస్తే ఇది ఇప్పట్లో పూర్తి అయ్యేలాగా కనిపించడం లేదు. అసలు సెట్స్ మీదకు వెళ్లేంత వరకు కూడా ప్రాజెక్ట్ మీద అనుమానమే అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.