Bigg Boss 9 Ritu Chaudhary: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన కాంట్రవర్షియల్ సెలబ్రిటీలతో ఒకరు రీతూ చౌదరి. బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ చేసిన సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపడం, ఆ సెలబ్రిటీల జాబితాలో రీతూ చౌదరి హిట్ లిస్ట్ లో ఉండడం వల్ల ఆమెకు బోలెడంత నెగిటివిటీ ఏర్పడింది. అంతే కాకుండా ఆమె మాజీ భర్త పెద్ద కుంభకోణం లో చిక్కుకోవడంతో రీతూ కి కూడా అందులో భాగం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్నిరోజుల వరకు ఆ విషయం లో రీతూ చౌదరి పేరు న్యూస్ ఛానెల్స్ లో మారుమ్రోగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమెకు ఉన్న వివాదాలు, నెగిటివిటీ సాధారణమైనది కాదు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈమె చుట్టూ బయట జరుగుతున్నా వివాదాలను మనమంతా చూశాము. పైగా ఈమె బోల్డ్ గా మాట్లాడుతూ ఉండడం, సీరియల్స్ లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఈమెపై జనాల్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ మామూలివి కాదు.
ఇంత నెగిటివిటీ ఉండడం వల్లే ఈమెకు ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. పైగా హౌస్ లోకి వెళ్లిన తర్వాత డిమోన్ పవన్ తో ప్రేమాయణం నడపడం కూడా ఈమెకు చాలా మైనస్ అయ్యింది. గేమ్స్ అద్భుతంగా ఆడుతుంది, నామినేషన్స్ సమయం లో తన పాయింట్స్ పై పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది, అయినప్పటికీ కూడా ఈమెకు ఓటింగ్ పెరగడం లేదు. అలాంటి రీతూ చౌదరి ఓటింగ్ ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అయేషా పైకి లేపే పనిలో ఉందని నిన్నటి ఎపిసోడ్ ని చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. నిన్న నామినేషన్ లో ఆమె రీతూ చౌదరి తో ప్రవర్తించిన తీరు, ఆమెతో మాట్లాడిన విధానం చూస్తే, ఎవరికైనా అయ్యో పాపం రీతూ అని అనిపించక తప్పదు.
గత వారం మాధురి తో దివ్య గొడవ పెట్టుకోవడం వల్ల, ఈరోజు ఆమె ఎలిమినేషన్ నుండి తప్పించుకొని బయటపడింది. వాస్తవానికి భరణికి బదులుగా, దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది. దివ్య కూడా ఈ వారం నేను ఇంటికి వెళ్ళిపోతాను అని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయింది. కానీ మాధురి తో ఆమె పెట్టుకున్న గొడవ కారణంగా ఈరోజు ఆమె గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. కచ్చితంగా ఇప్పట్లో అయితే ఎలిమినేట్ అవ్వదు. దివ్య లాగానే, ఇప్పుడు రీతూ చౌదరి గ్రాఫ్ కూడా బాగా పెరిగిపోయింది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమెకు డీసెంట్ స్థాయిలోనే ఓటింగ్ పడుతుంది. ఇదంతా అయేషా కారణంగానే అని చెప్పొచ్చు. ఆమె ఇలా రీతూ ని టార్గెట్ చేస్తూ, ఆమెపై నోరు పారేసుకుంటున్నంత కాలం రీతూ గ్రాఫ్ పెరుగుతూనే వెళ్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.