Wireless Earbuds: మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దీనిని వాడకుండా ఉండలేకపోతున్నారు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు చేతిలో మొబైల్ కచ్చితంగా ఉంటుంది. అయితే ఫోన్ అందుబాటులోకి వచ్చాక కొందరికి అనేక అనారోగ్యాలు కూడా వాటితో పాటు వచ్చాయి. ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే మొబైల్ కొన్ని రకాల సౌకర్యాలను కూడా అందిస్తోంది. అయితే ఈ సౌకర్యాల మాయలో పడి కొందరు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మొబైల్ కు వాడే హెడ్ ఫోన్స్ విషయంలో అజాగ్రత్తలు పాటించి చెవిపోటు తెచ్చుకుంటున్నారు. అసలు ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఎలాంటి ఇయర్ బడ్స్ వాడడం మంచిది? ప్రస్తుతం చాలామంది సెలబ్రెటీలు ఎలాంటి ఇయర్ బడ్స్ వాడుతున్నారు?
కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. మొబైల్ విషయంలో ఇది ఫాస్ట్ గా జరుగుతుంది. కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎంతో అభివృద్ధి చెందిన మొబైల్ .. దీనికి సంబంధించిన యాక్ససరీస్ కూడా కొత్త కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ కొత్తగా వచ్చిన కొత్తలో వైర్ తో కూడిన ఇయర్ ఫోన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వైర్ లేకుండా హెడ్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే కేబుల్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండడంతో చాలామంది వైర్లెస్ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారు. కానీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. వైర్లెస్ హెడ్ ఫోన్స్ వాడటం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయంటే?
వైర్ తో కూడిన హెడ్ ఫోన్స్ కంటే వైర్లెస్ హెడ్ ఫోన్స్ నుంచి రేడియేషన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఒక మొబైల్ 1000 నుంచి 2000 మిల్లీ వాట్ లు విడుదల చేస్తే.. వైర్లెస్ హెడ్ ఫోన్స్ మాత్రం అంతకుమించి ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. ఇలా ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల బ్రెయిన్ పై ఎక్కువగా స్ట్రైన్ పడుతుంది. World Health Organisation (WHO) ప్రకారం వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఒక గంట పాటు 60 వాల్యూమ్ లో వింటే చెవుడు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంటే ప్రతిరోజు ఒక గంట సేపు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వినడం వల్ల బ్రెయిన్ పై స్ట్రెస్ పెరగడమే కాకుండా చెవుడు వచ్చే అవకాశాలు ఉండడంతో పాటు అనేక రకాల మానసిక ఇబ్బందులు కూడా ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంతవరకు వైర్లెస్ హెడ్ ఫోన్స్ కు దూరంగా ఉంటే ప్రయత్నం చేయాలి.
అయితే ఒకప్పుడు వైర్ తో కూడిన హెడ్ ఫోన్స్ వాడేవారు. వైర్లెస్ buds కంటే వైర్ తో కూడిన హెడ్ ఫోన్స్ చాలా సేఫ్ అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం కొంతమంది సెలబ్రెటీస్ ఇలా వైర్ హెడ్ ఫోన్స్ వాడుతున్నారు. కొన్ని రకాల ముఖ్యమైన కమ్యూనికేషన్స్ తో పాటు సాంగ్స్ వినడానికి హెడ్ ఫోన్స్ తప్పనిసరి అవసరం ఉంటుంది. ఇలాంటివారు వైరుతో కూడిన హెడ్ ఫోన్స్ వాడాలని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు.