Sukumar : ఒక సాధారణ గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి, తన ప్రతిభకి లిమిట్స్ లేవు అని నిరూపించిన వారిలో ఒకరు జానీ మాస్టర్. ఒక తెలుగోడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతూ నేషనల్ అవార్డుని సైతం సొంతం చేసుకున్న వాడిగా జానీ మాస్టర్ కి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కానీ శ్రేష్టి వర్మ అనే అమ్మాయి కారణంగా జానీ మాస్టర్ జీవితం ఒక్కసారిగా తలక్రిందులు అయిపోయింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేసాడని, పెళ్లి చేసుకోమని అతను నన్ను తరచూ వేధిస్తున్నాడని, ఇలా పలు రకాల సంచలనమైన ఆరోపణలు చేసి కేసు వేసింది. పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేసి, నెల రోజుల పాటు రిమాండ్ కి తరలించి విచారించారు. ఆయన మీద పోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయ్యినందుకు వచ్చిన నేషనల్ అవార్డుని కూడా వెనక్కి తీసేసుకున్నారు.
అయితే ఇటీవలే జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలై మళ్ళీ తన వృత్తిపై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ఆయనకీ ఒకప్పటి రేంజ్ ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు కానీ, కచ్చితంగా ఆయన టాలెంట్ కి తగ్గ ఆఫర్స్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఆయనకీ మునుపటి వైభం వస్తుంది. ఇదంతా పక్కన పెడితే శ్రేష్టి వర్మ రీసెంట్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ‘పుష్ప 2 ‘ చిత్రం లోని పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ తో కలిసి ఈమె కూడా కొరియోగ్రఫీ చేసింది. నిన్న ఈ చిత్రంలోని ‘పుష్ప..పుష్ప’ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ ని శ్రేష్టి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ ‘పుష్ప 2 చిత్రం నుండి నా జీవితం లో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది.
ఆ పోస్ట్ లో ఆమె డైరెక్టర్ సుకుమార్ మరియు మూవీ టీం తో కలిసి కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది. ఇవి ఆమె పుట్టినరోజు ని పుష్ప 2 సెట్స్ లో టీం మొత్తం కలిసి సంబరాలు చేసుకున్న రోజు అయ్యుండొచ్చు అని నెటిజెన్స్ అనుకుంటున్నారు. మరోపక్క జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ప్లాన్ చేసి మరీ జానీ మాస్టర్ ని ఇరికించారని సోషల్ మీడియా లో ఊహాగానాలు చాలా కాలం నుండి ప్రచారం లో ఉన్నాయి. ఇవేమి నిరూపితం కాలేదు కానీ, ఈమెని సుకుమార్ ఈ స్థాయిలో ప్రోత్సహించడాన్ని చూసి అభిమానులు అరెస్ట్ వెనుక సుకుమార్ హస్తం ఉందా అనే కోణం లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఆయన శిక్షార్హుడే, ఒకవేళ ఆయన తప్పు చేయలేదని రుజువైతే తనని ఇరికించాలని చూసిన వాళ్ళందరి పేర్లు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి.